Cancer Silent Symptoms: క్యాన్సర్ నిశ్శబ్ద లక్షణాలు గుర్తించండి.. పొరపాటున కూడా విస్మరించవద్దు..!
Cancer Silent Symptoms: క్యాన్సర్ చాలా ప్రమాదకరమైన వ్యాధి. ఒక్కసారి వచ్చిందంటే కోలుకోవడం చాలా కష్టం.
Cancer Silent Symptoms: క్యాన్సర్ చాలా ప్రమాదకరమైన వ్యాధి. ఒక్కసారి వచ్చిందంటే కోలుకోవడం చాలా కష్టం. క్యాన్సర్ లక్షణాలు చాలా ఆలస్యంగా బయటపడుతాయి. అప్పటికే చాలావరకు నష్టం జరుగుతుంది. నేటి ఆధునిక కాలంలో చాలామంది రకరకాల క్యాన్సర్లకు గురవుతున్నారు. ఇదొక కామన్ వ్యాధిలా మారిపోయింది. నిజానికి క్యాన్సర్ లక్షణాలు వేగంగా విస్తరిస్తాయి. వీటిని గుర్తించినట్లయితే సకాలంలో చికిత్స తీసుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. అలాంటి క్యాన్సర్ నిశ్శబ్ద లక్షణాల గురించి తెలుసుకుందాం.
ఆకస్మికంగా బరువు తగ్గడం
క్యాన్సర్ కణాలు వేగంగా పెరుగుతాయి. దీని కోసం శరీరానికి ఎక్కువ శక్తి అవసరమవుతుంది. ఫలితంగా మీరు బరువు తగ్గుతారు. ఇది అకస్మికంగా జరిగితే వెంటనే డాక్టర్‌ని సంప్రదించాలి.
శరీరంలో గడ్డలు, వాపులు
శరీరంలో కారణం లేకుండా గడ్డలు,వాపులు క్యాన్సర్ లక్షణాలు అవుతాయి. ముఖ్యంగా రొమ్ము, వృషణాలు లేదా మెడలో గడ్డ కనిపిస్తే ఖచ్చితంగా వైద్యుడిని సంప్రదించాలి.
ఆహారాన్ని మింగడంలో ఇబ్బంది
నోటిలో, గొంతులో, జీర్ణవ్యవస్థలో క్యాన్సర్ కణితులు ఉంటే ఆహారాన్ని మింగడంలో ఇబ్బందిని కలిగిస్తాయి. ఇలాంటి సమస్య ఎదురైనప్పుడు డాక్టర్‌ని సంప్రదించాలి.
నిరంతర అలసట
అలసట అనేది ఒక సాధారణ విషయం. కానీ ఎటువంటి కారణం లేకుండా నిరంతరం అలసిపోతూ ఉంటే, విశ్రాంతి తీసుకున్న తర్వాత కూడా అలసట తగ్గకపోతే అది క్యాన్సర్ ప్రారంభ లక్షణం అవుతుంది.
నిరంతర నొప్పి
రాత్రిపూట అధ్వాన్నంగా ఉండే ఎముక నొప్పి, లేదా నిర్దిష్ట శరీర భాగంలో నిరంతర నొప్పి, క్యాన్సర్ సంకేతం అవుతుంది. చర్మంపై మొటిమల ఆకారం, రంగు, ఆకృతిలో మార్పులు క్యాన్సర్ ప్రారంభ లక్షణంగా చెప్పవచ్చు. ఇది కాకుండా చర్మంపై నిరంతరం దురద ఉంటే డాక్టర్‌ని సంప్రదించాలి. ఈ లక్షణాలు ఇతర ఆరోగ్య పరిస్థితుల వల్ల వస్తాయి. కానీ ఇవి క్యాన్సర్ కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి. అందుకే వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం.