How to Prepare Cake: ఇంట్లోనే రుచికరమైన కేక్ తయారు చేసుకోటం ఎలా?
How to Prepare Cake: ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది చిన్నా, పెద్ద అనే తేడాలేకుండా అమితంగా ఇష్టపడే ఆహారంలో కేక్ ఒకటి.
How to Prepare Cake: ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది చిన్నా, పెద్ద అనే తేడాలేకుండా అమితంగా ఇష్టపడే ఆహారంలో కేక్ ఒకటి. ఇక ఇంట్లో ఉండే పిల్లలు అది కొనివ్వమిని.. అక్కడకు వెల్దామని మారాం చేస్తుంటారు.. బయట ఫుడ్ తినాలని పేరెంట్స్‌ను విసిగించేస్తుంటారు.. అలాంటి పిల్లలను ఆకట్టుకునేందుకు ఎంతో ఈజీగా ఇంట్లోనే వెరైటీ వంటలను తయారుచేసుకోవచ్చు.. మరి పిల్లలు ఎంతగానో ఇష్టపడే కేక్ ను ఎంత సులువుగా తయారుచేసుకోవచ్చో తెలుసుకుందాం..
తయారీకి కావాల్సిన పదార్ధాలు..
* కోడి గుడ్లు - 3
* మైదాపిండి - 2 కప్పులు,
* వెన్న - 1 కప్పు,
* పంచదార - 1 1/2 కప్పు,
* మిఠాయి సోడా - 1/2 చెంచా,
* యాలకులు - (1 - 8)
తయారు చేసుకొనే విదానం..
ముందుగా మనకి కోడి గుడ్డు సోన (అంటే 3 కోడిగ్రుడ్ల సొన) తెసుకొని మనం తీసుకున్న పదార్ధాలను కలిపే పంచదార పూర్తిగా కలిసే వరకూ మిక్సీలో వేసి బాగా బ్లెండ్ చేయాలి.. ఒక కేకు పాన్ తీసుకుని అడుగున ఒక పళ్ళెంలో ఇసుక వేసికోవాలి. తరువాత పై పళ్ళెంలో నెయ్యని రాసి ముందుగా మనం తయారుచేసి పెట్టుకున్న మిశ్రమాన్ని వేయాలి. స్టౌను సిమ్ లో పెట్టి కుక్కుర్ ను ఆ స్టౌ పై పెట్టాలి. మధ్యమధ్యలో మూత తీసి చూసుకోవాలి. కొంచెం దోర రంగు రాగానే కుక్కర్ ను దించాలి. చల్లరబడ్డాకా బయటకు తీస్తే కేకులా తయారయి ఉంటుంది. బయట బజారులో కొనుక్కున్న కేకులకంటే ఇంటిలో తయారుచేసుకునే ఈ కేకు చాలా రుచిగా ఉంటుంది.