Health Tips: ఆందోళన, టెన్షన్‌ ఎలా ఎదుర్కోవాలి.. ఈ చిట్కాలు పాటించండి..!

Health Tips: ఆందోళన, టెన్షన్‌ అనేవి మానసిక సమస్యలు.

Update: 2023-01-12 01:30 GMT

Health Tips: ఆందోళన, టెన్షన్‌ ఎలా ఎదుర్కోవాలి.. ఈ చిట్కాలు పాటించండి..!

Health Tips: ఆందోళన, టెన్షన్‌ అనేవి మానసిక సమస్యలు. వీటి కారణంగా ఒక వ్యక్తి నెగటివ్‌ థింకింగ్‌, హృదయ స్పందనలో మార్పులు ఎదుర్కోవలసి ఉంటుంది. ఒక వ్యక్తికి ఈ సమస్య ఉన్నప్పుడు దాని వెనుక చాలా కారణాలు ఉంటాయి. వీటికి మీరు దూరంగా ఉండాలంటే కొన్ని పద్దతులు పాటించాలి. వాటి గురించి తెలుసుకుందాం.

దీర్ఘ శ్వాస

ఆందోళన సమస్య ఏర్పడినప్పుడు ఒక వ్యక్తి వేగంగా శ్వాస తీసుకుంటాడు. ఈ పరిస్థితిలో శ్వాసను నియంత్రించడం అవసరం. దీని కోసం మీరు 1 నుంచి 4 వరకు లెక్కించి లోతైన దీర్ఘ శ్వాస తీసుకోవాలి. దీనివల్ల హృదయ స్పందన రేటు కంట్రోల్‌ అవుతుంది. శ్వాసపై దృష్టి పెట్టడం వల్ల క్రమంగా ఆందోళనను అధిగమించవచ్చు.

15 నిమిషాల యోగా

ఆందోళన సమస్య ఉన్నప్పుడు వ్యక్తి నెగటివ్‌గా ఆలోచిస్తాడు. ఈ పరిస్థితిలో వాటిని ఆపడానికి క్రమం తప్పకుండా 15 నిమిషాలు యోగా చేయాలి. దీంతో మానసిక స్థితిని చక్కదిద్దవచ్చు. మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవచ్చు. యోగా చేయలేకపోతే రోజుకు 15 నిమిషాల వాకింగ్‌ అయినా చేయాలి. దీనివల్ల ఆందోళన సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.

ఆలోచనలను పేపర్‌పై రాయాలి

రకరకాల కారణాల వల్ల ఆందోళన, టెన్షన్‌ సమస్య ఎదురవుతుంది. అప్పుడు మీ మనస్సులో వచ్చిన ఆలోచనలు కాగితంపై రాయాలి. ఈ పద్ధతి మీకు విశ్రాంతి తీసుకోవడమే కాకుండా మనస్సులో వచ్చే నెగటివ్‌ ఆలోచనలను దూరంగా ఉంచుతుంది.

చెడు అలవాట్లకి దూరం

ధూమపానం, కెఫిన్, ఆల్కహాల్ తీసుకోవడం వల్ల ఆందోళన చెందుతుంటే వాటికి దూరంగా ఉండండి. ఉదాహరణకు మీరు కెఫిన్ తీసుకున్న తర్వాత ఆందోళన సమస్యను అనుభవిస్తున్నట్లయితే ఆహారంలో కెఫిన్‌ను తక్కువ మొత్తంలో తీసుకోండి. ఈ సమస్య దీర్ఘకాలికంగా ఉంటే తప్పనిసరిగా థెరపిస్ట్ సలహా తీసుకోవాలి.

Tags:    

Similar News