Home Remedies: ఆర్థరైటిస్...హోం రెమిడీస్
Home Remedies: ఆర్థరైటీస్ తో బాధపడుతున్నవారికి ఇంట్లో వుండే మూలికలతో కూడా కంట్రోల్ చేసుకోవచ్చు.
Home Remedies: చాలా మంది ఆర్థరైటీస్ బాధపడుతూ వుంటారు. ఈ మధ్య కాలంలో వయసుతో సంబంధం లేకుండా చాలా మందిని వేధిస్తోంది. జాయింట్‌లో ఇన్ఫర్మేషన్ అయినప్పుడు ఆర్థరైటిస్ వస్తుంది. ఆర్థరైటిస్ నిజంగా తీవ్రమైన నొప్పి తీసుకొస్తుంది ఆర్థరైటిస్ వల్ల స్పెల్లింగ్ ఉంటుంది ఒకటి లేదా అంత కంటే ఎక్కువ జాయింట్స్ దీనికి గురి అవుతూ ఉంటాయి. జాయింట్ పెయిన్స్, వాపు మరియు స్టిఫ్‌నెస్ ఆర్థరైటిస్‌కి లక్షణాలు. ఆర్థరైటిస్‌కి సమస్య ఉన్న వాళ్లలో నొప్పి తీవ్రంగా ఉంటుంది. తట్టుకోలేనంత నొప్పి వస్తుంది. అస్సలు దాని లక్షణాలు, ఇంట్లో ఉండే మూలికలతో ఎలా కంట్రోల్ చేసుకోవచ్చో మన 'లైఫ్ స్టైల్' లో చూద్దాం.
పసుపు...
పసుపులో వుండే యాంటి ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. పసుపు వలన చాలా బెనిఫిట్స్ మనకి లభిస్తాయి. మంచి ఆరోగ్య ప్రయోజనాలు కలగాలంటే పసుపును ఉపయోగించడం మంచిది. కేవలం ఆర్థరైటిస్ నొప్పి తొలగించడానికి మాత్రమే కాకుండా దీని వలన మనకి అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. ముందుగా పాలని మరిగించి ఆ పాలల్లో పంచదార తో పాటు ఒక చిటికెడు పసుపు వేసి తీసుకోవచ్చు. లేదా మీరు వేడి నీళ్లను మరిగించి దానిలో చిటికెడు పసుపు వేసి తీసుకున్నా మీకు మంచి బెనిఫిట్స్ ఉంటాయి.
అల్లం...
అల్లం లో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఎక్కువగా ఉన్నాయి. అల్లం తో కనుక టీ చేసి రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల మీకు మంచి బెనిఫిట్స్ ఉంటాయి. గొంతు నొప్పి, దగ్గు వంటి సమస్యల్ని చిటికె లో అల్లం పోగొడుతుంది. అల్లం టీ కోసం మీరు ముందుగా నీళ్లను మరిగించుకుని దానిలో కొద్దిగా అల్లం ముక్కలు వేసి బాగా మరిగిన తర్వాత వడకట్టి తీయదనం కోసం కొద్దిగా తేనే వేసుకుని తీసుకుంటే మంచి ఉపశమనం కలుగుతుంది.
గ్రీన్ టీ...
గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉన్నాయి పైగా ఇది ఇంఫ్లమేషన్ ని కూడా తగ్గిస్తుంది. అలానే గ్రీన్ టీ తీసుకోవడం వల్ల ఆర్థరైటిస్ సమస్య కూడా తగ్గి పోతుంది కనుక ప్రతి రోజూ రెండు నుంచి మూడు కప్పుల గ్రీన్ టీ తీసుకోవడం మంచిది. దీనితో మీకు ఉపశమనం లభించడమే కాకుండా ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది.
యూకలిప్టస్ ఆకులు లేదా ఆయిల్....
ఆర్థరైటిస్ నొప్పిని పోగొట్టడం లో యూకలిప్టస్ ఆకులు బాగా పని చేస్తాయి. ఈ ఆకులు ఉపయోగిస్తే స్వెల్లింగ్ మరియు నొప్పి కూడా పూర్తిగా తొలగి పోతుంది. అయితే మీరు ఒకసారి ఈ ఆకుల్ని ఉపయోగించేటప్పుడు టెస్ట్ చేసుకుని అప్పుడు ఉపయోగించండి. యూకలిప్టస్ ఆయిల్ ని కూడా మీరు ఉపయోగించ వచ్చు యూకలిప్టస్ ఆయిల్ వల్ల జలుబు, బ్రాంకైటిస్ కూడా తగ్గి పోతుంది. ఏది ఏమైనా యూకలిప్టస్ ఆయిల్ వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి అని చెప్పాలి. సో ఇంకెందుకు ఆలస్యం ఆర్థరైటీస్ తో బాధపడేవారు పై చెప్పిన వాటిని ఉపయోగిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకుందాం.