Health News: ఈ విటమిన్ అధిక స్థాయిలో తీసుకుంటే గుండె జబ్బుల ప్రమాదం.. అదేంటంటే..?
Health News: నేటి రోజుల్లో చాలామంది హార్ట్‌ఎటాక్‌తో చనిపోతున్నారు. సినిమా హీరోల దగ్గరి నుంచి సాధారణ పౌరుల దాకా అందరూ హార్ట్‌ఎటాక్ కు గురవుతున్నారు.
Health News: నేటి రోజుల్లో చాలామంది హార్ట్‌ఎటాక్‌తో చనిపోతున్నారు. సినిమా హీరోల దగ్గరి నుంచి సాధారణ పౌరుల దాకా అందరూ హార్ట్‌ఎటాక్ కు గురవుతున్నారు. ఒకప్పుడు 50 ఏళ్లు దాటినవారికి మాత్రమే గుండెజబ్బులు వచ్చేవి కానీ ఆధునిక రోజుల్లో చిన్నవయసులోనే గుండెజబ్బులకు గురై చనిపోతున్నారు. వరల్డ్ హార్ట్ ఫెడరేషన్ ప్రకారం గుండె జబ్బులు మరణాలకు మూడో అతిపెద్ద కారణం. ఊబకాయం, అధిక కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు, ధూమపానం, అనారోగ్యకరమైన జీవనశైలి వల్ల ఎక్కువగా గుండెజబ్బులకు గురవుతున్నారు. తాజాగా ఒక విటమిన్ వల్ల కూడా గుండెజబ్బులు వస్తున్నాయని తేలింది.
క్లీవ్‌ల్యాండ్ క్లినిక్ లెర్నర్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లోని పరిశోధకులు విటమిన్ బి 3 నియాసిన్ అధిక వినియోగం గుండె వ్యాధులను కలిగిస్తుందని కనుగొన్నారు.విటమిన్ B3 మరియు గుండెకు సుదీర్ఘ సంబంధం ఉంది.హైపర్లిపిడెమియా చికిత్సకు నియాసిన్ సప్లిమెంటేషన్ వాడుతారు. ఎందుకంటే ఇది LDL కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో HDL కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచడంలో సాయపడుతుంది. అధిక-మోతాదు నియాసిన్ (1,500–2,000 mg/day) కూడా కొలెస్ట్రాల్‌ను తగ్గించే మొదటి ఔషధాలలో ఒకటి.
హార్వర్డ్ ప్రకారం శరీరంలో విటమిన్ B3 పరిమాణం ఎక్కువగా ఉంటే మైకం, రక్తంలో తక్కువ చక్కెర, అలసట, తలనొప్పి, కడుపు నొప్పి, వికారం, అస్పష్టమైన దృష్టి, లవర్‌వాపు, వంటి లక్షణాలు కనిపిస్తాయి. నిజానికి విటమిన్ B3 స్థాయిలు శరీరంలో ఎప్పుడు పెరగవు. కానీ మీరు వాటి సప్లిమెంట్ తీసుకుంటే శరీరంలో అవసరమైన దానికంటే ఎక్కువ పరిమాణం పెరిగే అవకాశాలు ఉన్నాయి. అందుకే దీని విషయంలో జాగ్రత్తగా ఉండాలి.