Health Tips: ఫిట్‌గా ఉండాలంటే ఇవి తినాల్సిందే.. ఆహారంలో చేర్చాల్సిన పోషకాలు ఏంటో తెలుసా?
Health Tips: మనం ఆరోగ్యంగా ఉండే ఎలాంటి సమస్యలు ఉండవు, అలాంటప్పుడు మనం వైద్యుడిని సంప్రదించాల్సిన అవసరం ఉండదు.
Health Tips: మనం ఆరోగ్యంగా ఉండే ఎలాంటి సమస్యలు ఉండవు. అలాంటప్పుడు మనం వైద్యుడిని సంప్రదించాల్సిన అవసరం ఉండదు. ఇదంతా జరగాలంటే మన జీవనశైలి ఆరోగ్యంగా ఉండాలి. ఎప్పుడైతే జీవనశైలి దారి తప్పుతుందో.. అప్పటి నుంచి సమస్యలు మొదలవుతాయి. మన శరీరానికి అవసరమైన విటమిన్లు, మినరల్స్ లేకపోవడం ఇలాంటి సమస్యలు వస్తుంటాయి. ఇలాంటి పరిస్థితిలో, మీరు మీ ఆహారంలో ఏ పోషకాలను చేర్చుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
మీ ప్లేట్‌లో అన్ని రంగులను చేర్చండి...
తగినంత పోషకాలను పొందడానికి సులభమైన మార్గం ఏంటంటే.. మీ ప్లేట్‌లో అన్ని రంగుల ఆహారాలను చేర్చడమే పరిష్కారం. తెలుపు, ఎరుపు, ఆకుపచ్చ, పసుపు అన్ని రంగుల ఆహారాలలో వివిధ పోషకాలు, ప్రోటీన్లు ఉంటాయి. ఇవి యాంటీఆక్సిడెంట్లు, ఖనిజాలతో కూడిన ఆహారాన్ని అందిస్తాయి.
ఆహారంలో ఈ పోషకాలు ఉండేలా చూసుకోండి...
కార్బోహైడ్రేట్లు - శరీరంలోని శక్తికి ప్రధాన వనరుగా కార్బోహైడ్రేట్లు పనిచేస్తాయి. వివిధ రకాల ఆహారాలలో ఇవి కనిపిస్తాయి. మీరు తక్కువ కార్బ్ ఆహారంలో ఉన్నప్పటికీ, వాటిని ఖచ్చితంగా ఆహారంలో చేర్చడానికి ప్రయత్నించండి. లేదంటే శరీరంలో బలహీనత ఏర్పడవచ్చు.
ప్రోటీన్ - శరీరానికి ప్రోటీన్ ఎలా అవసరమో మీరు అర్థం చేసుకోవాలి. శరీరంలోని ప్రతి కణంలో ఉంటుంది. అందువల్ల, మీ ఆహారంలో చేపలు, మాంసం, పాల ఉత్పత్తులు, గుడ్లు, బీన్స్, కాయధాన్యాలు, ఇతర ప్రోటీన్ మూలాలను చేర్చండి.
విటమిన్లు - మన శరీరానికి 13 విటమిన్లు అవసరం. విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ డి, విటమిన్ ఇ, విటమిన్ కె, విటమిన్ బి1, విటమిన్ బి2, విటమిన్ బి3, పాంటోథెనిక్ యాసిడ్, బయోటిన్, విటమిన్ బి6, విటమిన్ బి12, ఫోలేట్ ఉన్నాయి. ఇవి కచ్చితంగా మీ ఆహారంలో ఉండేలా చూసుకోవాలి.