Brinjal Benefits: వంకాయలో ఆరోగ్య రహస్యాలు.. తెలిస్తే అస్సలు వదలరు..!
Brinjal Benefits: వంకాయలో ఆరోగ్య రహస్యాలు.. తెలిస్తే అస్సలు వదలరు..!
Brinjal Benefits: కూరగాయలలో రారాజు వంకాయ. దీనికి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. కానీ కొంతమందికి మాత్రం దీని రుచి నచ్చదు. ఇది లేత ఆకుపచ్చ, ఊదా, తెలుపు రంగులో ఉంటుంది. వంకాయలో ఎన్నో ఆరోగ్య రహస్యాలు దాగి ఉన్నాయి. అందుకే దీన్ని రోజువారీ ఆహారంలో చేర్చుకోవాలి. దీని ప్రయోజనాల గురించి తెలిస్తే ఎప్పుడు తిననివారు కూడా తినడానికి మొగ్గు చూపుతారు.
వంకాయ పోషకాలతో నిండి ఉంటుంది. ఇందులో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. అలాగే విటమిన్లు, ఫైబర్, మెగ్నీషియం, నియాసిన్, మెగ్నీషియం అధికంగా ఉంటాయి. దీన్ని రెగ్యులర్‌గా తినేవారికి చాలా ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. వంకాయలో యాంటీఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుంచి మన శరీరాన్ని రక్షిస్తుంది. అనేక తీవ్రమైన వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
వంకాయలో క్యాలరీ కంటెంట్ చాలా తక్కువగా ఉంటుంది. ఇది బరువు, కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో దోహదం చేస్తుంది. ఈ పరిస్థితిలో గుండెపోటు వంటి ప్రాణాంతక వ్యాధులని నియంత్రించడానికి తోడ్పడుతుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు రెగ్యులర్ డైట్‌లో తప్పనిసరిగా వంకాయను చేర్చుకోవాలి. ఎందుకంటే ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. రక్తంలో చక్కెరను అదుపులో ఉంచుతుంది.