చేదైన కాకరతో మేలైన ఆరోగ్యం

కాకరకాయలు తినడానికే కాదు ఆ పేరు వినడానికి కూడా ఈ తరం వారు ఇష్టపడరు..కారణం అది చేదుగా ఉంటుంది కాబట్టి...కానీ చేదుగా ఉండే కాకర మనకు చేసే మేలు ఎంతో ఉందని మన ఆయుర్వేదం చెబుతుంది.

Update: 2020-02-16 05:09 GMT

కాకరకాయలు తినడానికే కాదు ఆ పేరు వినడానికి కూడా ఈ తరం వారు ఇష్టపడరు..కారణం అది చేదుగా ఉంటుంది కాబట్టి...కానీ చేదుగా ఉండే కాకర మనకు చేసే మేలు ఎంతో ఉందని మన ఆయుర్వేదం చెబుతుంది. పిల్లలేంటి, పెద్దలేంటి.. మహిళలేంటి, పురుషులేంటి..... అందరికీ కాకరకాయ దివ్య ఔషధంగా పనిచేస్తుంది. కాకరకాయలు ప్రధానంగా మధుమేహగ్రస్తులకు ఓ వరం అని చెప్పాలి... ఈ కాకరకాయల రసాన్ని రోజూ పరగడుపున తీసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

ఈ రసం తాగడం వల్ల షుగర్ లెవల్స్ కంట్రోల్ అవుతాయి అంతే కాదు...ఈ రసం ఇన్సులిన్‌లా పనిచేస్తుందని చెబుతున్నారు. షుగర్ పేషంట్స్‌కే కాదు..ఈ కాకరకాయ రసం అధిక బరువును అదుపులో ఉంచుతుంది...జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. కాకరలో ఉండే పీచు పదార్ధం మలబద్దకాన్ని పోగొడుతుంది. ప్రధానంగా శరీర అంతర్భాగంలో పేర్కునిపోయిన వ్యర్ధా పదార్ధాలను బయటకు పంపి శరీరాన్ని శుభ్రం చేస్తుంది. ఇక రక్తపోటు, హైబీపీ, అలర్జీల సమస్యలు అస్సలు దరిచేరవు. మరీ ముఖ్యంగా రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇక వాంతులు వంటి సమస్యలను కాకర నయం చేస్తుంది. కాకరకాయ రసం క్రమం తప్పకుండా తాగడం వల్ల కంటి చూపు కూడా మెరుగవుతుందని నిపుణుల మాట. కాలేయ వ్యాధికి చెక్ పెడుతుంది.

ఛర్మ, శ్వాసకు సంబంధించిన వ్యాధులను కాకర దూరం చేస్తుంది. తరుచుగా కాకర కాయను ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల ప్రాణాంతక వ్యాధులైన క్యాన్సర్ వంటివి దరి చేరవు. ఇక కిడ్నీల్లో రాళ్ల సమస్యతో బాధపడేవారు. కాకర రసం తాగితే మంచి ఫలితం ఉంటుంది... కాకరలో ఉండే విటమిన్ సి, మెగ్నీషియం, పొటాసియం, జింక్, ఐరన్ వంటి పోషకాలు ఉన్నాయి ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. కాకరలోఉండే సి, ఏ, జింక్ విటమిన్ల వల్ల చర్మానికి మెరుపు వస్తుంది. జుట్టకు కాకర గుజ్జును రాయడం చుండ్రు సమస్య తగ్గి జుట్టు నిగనిగలాడుతుంది. మద్యానికి బానిసలైన వారు కాకర రసం తీసుకోవడం వల్ల లివర్‌ సమస్యలను అధిగమించవచ్చు. అలాగే మహిళలు ఈ రసం తాగడం వల్ల గర్భశయ, రొమ్ము క్యాన్సర్ ప్రమాదాల నుంచి బయటపడవచ్చు. కానీ గర్బిణీ స్త్రీలు , బాలింతలు ఈ కాకర రసాన్ని మితంగా తీసుకోవాలి..ముఖ్యంగా పండిన కాకరను తీసుకోవడం మంచిది కాదు.

Tags:    

Similar News