అందమైన చర్మ సౌందర్యం కోసం ఆముదము..
సాధారణంగా చాలమంకిది టీనేజ్ లో ముఖంపై మచ్చలు వస్తాయి.
సాధారణంగా చాలమంకిది టీనేజ్ లో ముఖంపై మచ్చలు వస్తాయి. అయితే మచ్చల సమస్యలకు ఆముదము ఎంతగానో ఉపయోగపడుతుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఆముదమును ఒంటికి పట్టించి 15 నిమిషాల తరువాత గోరు వెచ్చని నీటితో స్నానం చేస్తే.. చర్మం లోని చనిపొయిన, వృదా చర్మ కణాలని తుడిచేసి అందమైన.. మెరిసే చర్మాన్ని ఇస్తుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. అలాగే వేడి చేసిన ఆముదమును రాత్రి పడుకునే ముందు పాదాలకు పట్టించి.. ఉదయాన్నే గోరు వెచ్చని నీటితో కడిగేస్తే .. పగిలిన పాదాలనుండి విముక్తి లభిస్తుంది. కొంత మందికి చిన్న వయస్సులోనే చర్మంపై ముడతలు పడుతుంది.
అయితే ఆ ముడతలు పడిన చర్మానికి వేడి చేసిన ఆముదమును రాసి, మెల్లగా మర్దనా చేస్తే మంచి ఫలితాలు వస్తాయంటున్నారు నిపుణులు. అలాగే ఆముదముతో.. బేకింగ్ సోడా కలిపి మచ్చలపై రాస్తే.. చర్మంపై ఉన్న మచ్చలు తొలిగిపోతాయి. చర్మం పై.. గీతలు, మొటిమలు, మచ్చలు ఎలాంటి వాటికైన ఈ ఆముదము మంచి చికిత్సలా ఉపయోగపడుతుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. అలాగే చర్మాన్ని తేమగా ఉంచడానికి 'చర్మం యొక్క మాయిశ్చ్చరైజర్' గా ఆముదము ఉపయోగపడుతుందంటున్నారు నిపుణులు.