Thyroid Effect: థైరాయిడ్ కారణంగా బరువు పెరిగారా.. తగ్గడానికి ఈ చిట్కాలు అనుసరించండి..!
Thyroid Effect: మన మెడలో థైరాయిడ్ అనే గ్రంథి ఉంటుంది.
Thyroid Effect: మన మెడలో థైరాయిడ్ అనే గ్రంథి ఉంటుంది. ఇది చాలా ముఖ్యమైన హార్మోన్లను తయారుచేయడానికి పనిచేస్తుంది. థైరాయిడ్ గ్రంధి ప్రధానంగా T3, T4 హార్మోన్లను స్రవిస్తుంది. శరీరంలో అయోడిన్ లోపం ఏర్పడినప్పుడు థైరాయిడ్ గ్రంథి హార్మోన్లను సరిగ్గా ఉత్పత్తి చేయదు. దీనివల్ల అనేక సమస్యలు మొదలవుతాయి. థైరాయిడ్ వల్ల శరీర బరువు పెరుగుతుంది. అయితే ఈ పెరిగిన బరువుని తగ్గించుకోవడానికి కొన్ని సులభమైన చిట్కాలను పాటించవచ్చు. వాటి గురించి తెలుసుకుందాం.
బీన్స్ తినండి
బీన్స్, పప్పులు తినడం థైరాయిడ్ రోగులకు చాలా మంచిది. వీటిలో ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. పప్పులు, బీన్స్ తినడం వల్ల బరువు అదుపులో ఉంటుంది.
డ్రై ఫ్రూట్స్ తినండి
డ్రై ఫ్రూట్స్ తినడం థైరాయిడ్‌లో మేలు చేస్తుంది. వీటిలో ప్రోటీన్లు, యాంటీ ఆక్సిడెంట్లు, కార్బోహైడ్రేట్లు, విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇంకా నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల చాలా మేలు జరుగుతుంది.
పుష్కలంగా నీరు తాగాలి
బరువు తగ్గడానికి నీరు తాగడం చాలా అవసరం. ప్రతిరోజు జ్యూస్‌లు లేదా ఏదైనా రసం తాగాలి. కొబ్బరినీరు ఎక్కువగా తీసుకోవాలి.
జాగింగ్ చేయాలి
బరువు తగ్గడానికి శారీరక శ్రమ అవసరం. భారీ వ్యాయామం చేయలేకపోతే జాగింగ్ చేయండి. నడకకు వెళ్లడం వల్ల సులువుగా బరువు తగ్గుతారు.
చక్కెరను నివారించండి
మీకు థైరాయిడ్ ఉన్నప్పుడు తీపి పదార్థాలు తినడం మానేయాలి. చక్కెర కారణంగా బరువు వేగంగా పెరుగుతారు. మీరు ఫిట్‌గా ఉండాలనుకుంటే చక్కెర వినియోగానికి దూరంగా ఉండటం మంచిది.
కూరగాయలు తినండి
థైరాయిడ్ వల్ల పెరిగిన బరువును తగ్గించుకోవడానికి క్యాప్సికమ్, టొమాటో వంటి కూరగాయల సలాడ్‌లు తినడం మేలు చేస్తుంది. వీటిలో ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి బరువు తగ్గించడంలో సహాయపడతాయి.