Banana Tricks: అరటిపండ్లు త్వరగా పాడవుతున్నాయా.. ఈ ట్రిక్స్ తెలిస్తే ఆ సమస్య ఉండదు..!
Banana Tricks: అరటిపండులో విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి.
Banana Tricks: అరటిపండుని అందరు ఎంతో ఇష్టంగా తింటారు. దీని ధర తక్కువగా ఉంటున్నది కాబట్టి పేదలపండుగా పిలుస్తారు.అరటిపండులో విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీర అవసరాలను తీర్చడానికి పని చేస్తాయి. అరటిపండ్లు తినడం వల్ల జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. ఇది మూత్రపిండాలు, గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఎందుకంటే ఇందులో ఐరన్, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్ గుణాలు ఉంటాయి. అంతే కాకుండా చాలా రకాల ఎంజైములు కూడా ఉంటాయి. అయితే వేసవిలో అరటిపండ్లను తాజాగా ఉంచడం కొంచెం కష్టమైన పని. ఇవి త్వరగా నల్లగా మారుతాయి. ఈ పరిస్థితిలో అరటిపండ్లను ఎక్కువ కాలం తాజాగా ఉంచడానికి ఈ చిట్కాలను అనుసరించవచ్చు.
వేలాడదీయండి
అరటిపండ్లు కొనడానికి వెళ్లినప్పుడు వాటిని వేలాడదీయడం మీరు గమనించే ఉంటారు. ఇలా చేయడం వల్ల అరటిపండ్లు త్వరగా పాడవవు. అందుకే ఇంట్లో కూడా అరటిపండు కాండానికి దారం కట్టి వేలాడదీయవచ్చు. ఎక్కువ కాలం తాజాగా ఉంటాయి.
ప్లాస్టిక్ పేపర్‌లో చుట్టడం
మీరు అరటిపండ్లను ప్లాస్టిక్ పేపర్‌లో చుట్టి ఉంచవచ్చు. దీనివల్ల అవి త్వరగా పాడవకుండా ఉంటాయి. అయితే అరటిపండు కాండం చివర నుంచి చుట్టాలని గుర్తుంచుకోండి. దీనివల్ల అరటిపండు మెల్లగా పండుతుంది. 4 నుంచి 5 రోజుల వరకు తాజాగా ఉంచవచ్చు.
వెనిగర్ ఉపయోగించండి
అరటిపండ్లను కొన్ని రోజులు తాజాగా ఉంచడానికి వెనిగర్‌ని ఉపయోగించవచ్చు. ఇందుకోసం ఒక పాత్రలో నీటిని తీసుకోవాలి. ఒక చెంచా వెనిగర్ అందులో కలపాలి. తరువాత అరటిపండును అందులో ముంచి విడిగా వేలాడదీయాలి. దీంతో అరటిపండ్లు ఎక్కువ కాలం తాజాగా ఉంటాయి.
ఈ విషయాలను గుర్తుంచుకోండి
అరటిపండ్లకు ఎప్పుడూ ప్లాస్టిక్ కవర్స్‌ల ఉంచకూడదు. దీనివల్ల అవి త్వరగా పాడైపోతాయి. అలాగే అరటిపండ్లను సూర్యరశ్మి పడని చోట నిల్వ చేయాలి. అంతేకాకుండా మామిడి, ఆపిల్, నారింజ వంటి పండ్లకు దూరంగా ఉంచాలి. అరటిపండ్లతో కలిపి ఉంచితే త్వరగా పాడవుతాయి.