మార్కెట్‌లో కొన్న కారం నకిలీదా, నిజమైనదా ఇలా గుర్తించండి..!

Red Chilli Powder: కారంపొడి అనేది మన వంటగదిలో ఒక ముఖ్యమైన భాగం.

Update: 2023-02-14 14:30 GMT

మార్కెట్‌లో కొన్ని కారం నకిలీదా, నిజమైనదా ఇలా గుర్తించండి..!

Red Chilli Powder: కారంపొడి అనేది మన వంటగదిలో ఒక ముఖ్యమైన భాగం. ఇది లేకుండా రుచికరమైన వంటకాలను ఊహించలేము. పూర్వకాలంలో కారంపొడిని ఇంట్లోనే తయారుచేసేవారు. కానీ నేటికాలంలో చాలామంది సమయం లేకపోవడం వల్ల మార్కెట్‌లో దొరికే ఎర్ర కారం కొనుగోలు చేస్తున్నారు. అయితే వీటిలో చాలావరకు కల్తీ చేస్తున్నారు. కాబట్టి ఎప్పుడు కొనడానికి వెళ్లినప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే కొన్నకారం నిజమైనదా నకిలీదా తెలుసుకోవడానికి ఈ చిట్కాలు పాటించండి.

చాలామంది వ్యాపారులు ఎర్ర మిరపపొడిలో కొన్ని రకాల రసాయనాలు, పదార్థాలని కలిపి మార్కెట్‌లో విక్రయిస్తున్నారు. ఎక్కువ లాభం పొందడానికి ఈ విధంగా చేస్తున్నారు. వీటిలో ఎక్కువగా కృత్రిమ రంగులు, ఇటుక రంపపు పొడి, పాత చెడిపోయిన మిరియాల సుద్ద, సబ్బులలో వాడే రసాయనాలు, ఎర్ర ఇసుకని కలిపి ఆకర్షణీయంగా తయారుచేస్తున్నారు. వీటిని కలపడం వల్ల రెడ్ చిల్లీ పౌడర్ లోపాన్ని దాచడానికి ప్రయత్నిస్తున్నారు.

ముఖ్యంగా కృత్రిమ రంగులను ఉపయోగించడం వల్ల కారం పొడి ఎర్రగా, ఆకర్షణీయంగా కనిపిస్తుంది. తద్వారా మార్కెట్‌లో ప్రజలు దీనిని చూసి సులువుగా కొనుగోలు చేస్తున్నారు. నకిలీ కారం వల్ల ప్రజల ఆరోగ్యం దెబ్బతినకుండా ఉండటానికి ప్రజలకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పించడానికి భారత ప్రమాణాల అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) ప్రయత్నించింది. నకిలీ ఎర్ర మిరప పొడిని గుర్తించడానికి కొన్ని మార్గాలని తెలియజేసింది.

అసలు మరియు నకిలీని గుర్తించడం ఎలా..?

1. దీని కోసం మీరు ఒక గ్లాసులో నీటిని తీసుకోవాలి.

2. తర్వాత ఈ నీటిలో 1 టీస్పూన్ ఎర్ర మిరప పొడిని కలపాలి.

3. అడుగుభాగాన మిగిలిన అవశేషాలను తనిఖీ చేయాలి.

4. రెండు వేళ్లతో దానిని పట్టుకొని రుద్దలి. అప్పుడు అది గరుకుగా అనిపిస్తే అందులో ఇటుక పొడి కలిపినట్లు అర్థం చేసుకోండి.

5. ఒకవేళ సబ్బు లాగా స్మూత్ గా అనిపిస్తే అందులో రసాయనాలు మిక్స్ అయ్యాయని అర్థం చేసుకోండి.

Tags:    

Similar News