Ayurvedic Tips: చలికాలంలో ఆరోగ్యంగా ఉండాలంటే ఈ ఆయుర్వేద చిట్కాలు తప్పనిసరి..!

Ayurvedic Tips: చలికాలంలో ఆరోగ్యం కాపాడుకోవడం కొంచెం కష్టమే.

Update: 2022-12-15 13:00 GMT

Ayurvedic Tips: చలికాలంలో ఆరోగ్యంగా ఉండాలంటే ఈ ఆయుర్వేద చిట్కాలు తప్పనిసరి..!

Ayurvedic Tips: చలికాలంలో ఆరోగ్యం కాపాడుకోవడం కొంచెం కష్టమే. ఉష్ణోగ్రతలు పడిపోతున్న సందర్భంలో అనేక ఆరోగ్య సంబంధిత సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. ఈ సీజన్‌లో సాధారణంగా జలుబు, దగ్గు సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ఈ పరిస్థితిలో రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడం చాలా ముఖ్యం. ఈ సీజన్‌లో ఆరోగ్యంగా ఉండటానికి కొన్ని ఆయుర్వేద చిట్కాలను అనుసరించవచ్చు. వాటి గురించి తెలుసుకుందాం.

పసుపు పాలు

పాలలో కాల్షియం ఉంటుంది. ఇది ఎముకలను దృఢంగా ఉంచడంలో సహాయపడుతుంది. పసుపులో యాంటీబయాటిక్ లక్షణాలు ఉంటాయి. ఇది జలుబు, ఫ్లూ వంటి సమస్యలను నివారిస్తుంది. చలికాలంలో పసుపు పాలు తీసుకుంటే చాలా మంచిది. ఇది రుచిగా ఉండటమే కాకుండా చాలా ఆరోగ్యకరమైనది కూడా. రాత్రి పడుకునే ముందు పాలు తీసుకోవడం వల్ల మంచి నిద్ర వస్తుంది. ఈ సీజన్‌లో చాలా మంది కాఫీ లేదా టీ తాగుతారు. కానీ కెఫిన్ అధిక వినియోగం ఆరోగ్యానికి హానికరం.

వేడి ఆహారం

వేసవితో పోలిస్తే శీతాకాలంలో జీర్ణవ్యవస్థ బలహీనంగా ఉంటుంది. చలికాలంలో చల్లని ఆహారాన్ని తినడం మంచిదికాదు. దీనివల్ల జీర్ణవ్యవస్థ చాలా కష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అజీర్తి, పొట్టకు సంబంధించిన అనేక సమస్యలు ఎదురవుతాయి. అందుకే చలికాలంలో చల్లటి ఆహారం తినకూడదు.

మసాజ్

చలికాలంలో బాడీ మసాజ్ చాలా మేలు చేస్తుంది. ఇది మీ చర్మాన్ని పొడిబారకుండా కాపాడుతుంది. ఈ సీజన్‌లో నువ్వుల నూనె లేదా ఆవనూనెతో మసాజ్ చేసుకోవచ్చు. ఇది మీ శరీరానికి వెచ్చదనాన్ని ఇస్తుంది. ఇది మీకు ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగించడానికి పనిచేస్తుంది. దీంతో పాటు మంచి నిద్ర పడుతుంది.

కొబ్బరి నూనె

శీతాకాలంలో జుట్టు, స్కాల్ప్ మసాజ్ కోసం కొబ్బరి నూనెను ఉపయోగించవచ్చు. ఇది మీ జుట్టు పొడిబారకుండా కాపాడుతుంది. ఇది జుట్టుకు పోషణనిస్తుంది. ఇది మీ జుట్టును మెరుగుపరచడంలో సహాయపడుతుంది. దీని కోసం చేతిలో కొన్ని చుక్కల కొబ్బరి నూనె తీసుకొని తలకు మసాజ్ చేయాలి. ఇది మీ జుట్టును బలంగా మృదువుగా మార్చడంలో సహాయపడుతుంది.

యోగాసనాలు, ధ్యానం

చలికాలంలో చురుకుగా ఉండేందుకు యోగా చేయాలి. ఉదయం కాసేపు వాకింగ్‌ చేయాలి. ఇది యాక్టివ్‌గా ఉండటానికి సహాయం చేస్తుంది. దీంతో పాటు ప్రతిరోజూ ధ్యానం చేయాలి. ఇది ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది.

Tags:    

Similar News