Google Trends 2022: ఆహారం, ఆరోగ్యం గురించి గూగుల్‌లో ఎక్కువగా సెర్చ్‌ చేసినవి ఇవే..!

Google Trends 2022: గుడ్డులోని పసుపు భాగం ఆరోగ్యానికి హానికరమా?

Update: 2023-02-25 05:41 GMT

Google Trends 2022: ఆహారం, ఆరోగ్యం గురించి గూగుల్‌లో ఎక్కువగా సెర్చ్‌ చేసినవి ఇవే..!

Google Trends 2022: గుడ్డులోని పసుపు భాగం ఆరోగ్యానికి హానికరమా? క్యారెట్లు రేచికటిని తొలగిస్తాయా.. టాయిలెట్ సీట్ల ద్వారా లైంగిక వ్యాధులు సంభవిస్తాయా.. 2022లో Googleలో ఎక్కువగా సెర్చ్‌ చేసిన కొన్ని ప్రశ్నలు ఇవి. ఒక ఆంగ్ల వెబ్‌సైట్ ఈ సమాచారాన్ని Google Trends Data 2022 నుంచి సేకరించింది. 2022 సంవత్సరంలో ప్రజలు ఎక్కువగా సెర్చ్‌ చేసిన కొన్ని ఆరోగ్య అపోహల గురించి ఈరోజు తెలుసుకుందాం.

గుడ్డు పచ్చసొన ఆరోగ్యానికి హానికరమా?

గత కొన్ని దశాబ్దాలుగా గుడ్లు అధిక కొలెస్ట్రాల్‌కు కారణమవుతుందని అందరు అనుకుంటున్నారు. కానీ ఇందులో నిజం లేదు. ఇది అపోహ మాత్రమే. 2022 సంవత్సరంలో గూగుల్‌లో ఎక్కువ మంది దీని గురించి సెర్చ్‌ చేశారు. వాస్తవానికి గుడ్డు పచ్చసొనలో ప్రోటీన్లు, కొవ్వు ఆమ్లాలు, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. దీన్ని తినడం వల్ల ఎలాంటి హాని ఉండదు.

డియో లేదా పెర్ఫ్యూమ్ క్యాన్సర్‌కు కారణమవుతుందా?

పెర్ఫ్యూమ్ క్యాన్సర్‌కు కారణమా అనే ప్రశ్నను కూడా చాలామంది సంధించారు. కొందరు వ్యక్తులు డియోలో అల్యూమినియం ఉందని అందువల్ల ఇది క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుందని చెప్పారు. అయితే దీనిపై యూకేలో నిర్వహించిన క్యాన్సర్ పరిశోధనలో ఎటువంటి ఆధారాలు వెలువడలేదు.

టాయిలెట్ సీటు నుంచి ఇన్ఫెక్షన్ ?

టాయిలెట్ సీట్ నుంచి లైంగికంగా సంక్రమించే ఇన్‌ఫెక్షన్ (STI)కి కారణమవుతుందా అని కూడా ప్రజలు గూగుల్‌లో వెతికారు. అయితే ఇన్ఫెక్షన్‌కు కారణమయ్యే బ్యాక్టీరియా ఉపరితలంపై కొద్దికాలం పాటు మాత్రమే మనుగడ సాగిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇది కాకుండా ఈ వ్యాధికి కారణమయ్యే బ్యాక్టీరియా మానవ శరీరం వెలుపల జీవించదు.

క్యారెట్ తినడం వల్ల చూపు స్పష్టంగా కనిపిస్తుందా?

గూగుల్ ట్రెండ్స్ డేటా 2022 ప్రకారం క్యారెట్ తినడం వల్ల రాత్రి పూట కళ్లు బాగా కనిపిస్తాయా.. అని గూగుల్‌లో ఎక్కువ మంది వెతికారు. అయితే దీనికి సమాధానం లేదు. నిజానికి కళ్లకు చాలా ముఖ్యమైన విటమిన్ ఎ క్యారెట్‌లో ఎక్కువగా ఉంటుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అంతేకానీ రాత్రిపూట కళ్లు బాగా కనిపిస్తాయని దీని అర్థం కాదు.

Tags:    

Similar News