Health Tips: ఎర్రకారం పేరుతో ఇటుక పొడి తింటున్నారా.. అసలైన కారం గుర్తించండి..!

Health Tips: వంటకాలలో కారం లేకపోతే ఎటువంటి రుచి ఉండదు. అందుకే దీనికి అధిక ప్రాధాన్యత ఉంటుంది.

Update: 2022-11-14 13:09 GMT

Health Tips: ఎర్రకారం పేరుతో ఇటుక పొడి తింటున్నారా.. అసలైన కారం గుర్తించండి..!

Health Tips: వంటకాలలో కారం లేకపోతే ఎటువంటి రుచి ఉండదు. అందుకే దీనికి అధిక ప్రాధాన్యత ఉంటుంది. అయితే మీరు వాడే కారం.. కారం కాదు ఇటుక పొడి అని తెలిస్తే షాక్‌ అవుతారు. అవును మీరు విన్నది నిజమే. కొంతమంది వ్యాపారులు లాభాల కోసం పక్కదారిపడుతున్నారు. తక్కువ సమయంలో ధనవంతులు కావడానికి కల్తీ కారం అమ్ముతున్నారు. ఈ పరిస్థితిలో మీ వంటగదిలో ఉన్న ఎర్ర మిరప పొడి నిజమైనదా కాదా అని గుర్తించడం అవసరం. అయితే కొన్ని చిట్కాల ద్వారా కల్తీ కారం పొడిని గుర్తించవచ్చు.

ఎర్ర కారం పొడి కల్తీ

ఎర్ర కారం ఎలా కల్తీ జరుగుతుందో తెలుసుకోవడం ముఖ్యం. కొంతమంది దుకాణదారులు ఎర్రమిరపకాయలలో ఇసుక, సుద్దపొడి, ఇటుక పొడి లేదా ఊకను కలిపి కారంగా పట్టిస్తున్నారు. ఇది సహజసిద్దంగా కనిపించడానికి కృత్రిమ ఎరుపు రంగును కలుపుతారు. దీంతో ఇది ప్రకాశవంతమైన ఎరుపు రంగులో కనిపిస్తుంది. కస్టమర్ దానిని చూడగానే కొనడానికి ఆసక్తి చూపుతాడు. ఈ విధంగా కారం కల్తీ చేస్తున్నారు.

కల్తీ కారం గుర్తించడం ఎలా..?

మీ వంటగదిలో ఉన్న కల్తీ రెడ్ చిల్లీ పౌడర్ నిజమో కాదో గుర్తించడానికి అర గ్లాసు నీటిని తీసుకుని అందులో ఒక టీస్పూన్ కారాన్ని కలపాలి. తరువాత దానిని నీటిలో కలపడానికి ప్రయత్నించండి. ఆ పొడి నీళ్లలో కరిగి నీళ్ల రంగు ముదురు ఎరుపు రంగులోకి మారితే అందులో కల్తీ ఉందని అర్థం. నిజమైన కారం ఎప్పుడు నీటిలో కరగదు. నీటిపైనే తేలుతుంది. ఎర్రటి రంగు నీళ్లలో మెల్లగా నాని అడుగు భాగాన గడ్డ కడుతుంది. దాన్ని చేతి వేళ్లతో చూస్తే ఊక అని తెలిసిపోతుంది.

కారంలో ఇటుక పొడి..

ఎర్ర మిరప పొడిలో ఇటుక డస్ట్ లేదా ఇసుక కూడా కలుపుతారు. దీనిని గుర్తించడానికి సగం గ్లాసు నీరు తీసుకొని అందులో ఒక చెంచా కారం కలపాలి. తరువాత తడిసిన కారాన్ని అరచేతిపై వేసుకొని రుద్దాలి. అలా రుద్దుతున్నప్పుడు గరుకుగా, సాగుతుంది. ఇలా అయితే అది కల్తీ కారం అని గుర్తించండి. ఇటుక పొడి లేదా ఇసుక అందులో కలిసినట్లు అర్థం.

Tags:    

Similar News