పచ్చి శెనగలో అద్భుతమైన పోషకాలు.. ఈ వ్యాధులకి చక్కటి ఔషధం..!
Green Chickpeas: చలికాలంలో ఆరోగ్యానికి మేలు చేసే అనేక పండ్లు, కూరగాయలతో పాటు కొన్ని ప్రత్యేకమైన గింజలు కూడా ఉంటాయి.
Green Chickpeas: చలికాలంలో ఆరోగ్యానికి మేలు చేసే అనేక పండ్లు, కూరగాయలతో పాటు కొన్ని ప్రత్యేకమైన గింజలు కూడా ఉంటాయి. అందులో ముఖ్యమైనవి పచ్చి శెనగలు. వీటిని వేయించి మరీ తింటారు. ఇవి తినడానికి రుచికరంగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఇందులో ఉండే పోషకాలు అనేక తీవ్రమైన వ్యాధుల ప్రమాదాన్ని దూరం చేస్తాయి. పచ్చి శెనగలు తినడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.
పచ్చి శెనగలో మొక్కల ఆధారిత ప్రోటీన్ ఉంటుంది. విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ ఇ, విటమిన్ కె పుష్కలంగా లభిస్తాయి. ఫైబర్, ఐరన్, ఫోలేట్, ఫాస్పరస్, సోడియం, మెగ్నీషియం, పొటాషియం, సెలీనియం, కాల్షియం, కేలరీలు, కొవ్వులు, కార్బోహైడ్రేట్లు, కొవ్వు ఆమ్లాలు వంటి పోషకాలు ఇందులో ఎక్కువగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల కండరాలు దృఢంగా తయారవుతాయి. ఎముకలు బలపడుతాయి.
గర్భిణీలకు మేలు
పచ్చి శెనగలు గర్భిణీలకి ఎంతో మేలు చేస్తాయి. ఇందులో ఉండే విటమిన్ బి9 పిండం అభివృద్ధిలో సహాయపడుతుంది. అబార్షన్ వంటి పరిస్థితులను నివారించడానికి సహాయపడుతుంది.
జీర్ణ సమస్యలను తొలగిస్తాయి
పచ్చి శెనగలు జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలను దూరం చేస్తుంది. ఇందులో ఫైబర్ పుష్కలంగా లభిస్తుంది. ఇది జీవక్రియను పెంచుతుంది. పచ్ శెనగలు తినడం వల్ల పెద్దపేగు క్యాన్సర్ వచ్చే ప్రమాదం తగ్గుతుంది.
గుండె ఆరోగ్యం
పచ్చి శెనగలు గుండెకు చాలా మేలు చేస్తాయి. ఇందులో మెగ్నీషియం, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయి. వీటిని తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది.
చర్మం జుట్టుకు మేలు
పచ్చి శెనగలు చర్మం, జుట్టు, గోళ్లకు మేలు చేస్తుంది. ఇందులో ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టును బలోపేతం చేయడానికి పనిచేస్తాయి. డ్రై స్కిన్ సమస్యను దూరం చేస్తాయి. గోళ్లను బలంగా మారుస్తుంది.