Sleeping Disorder: రాత్రంతా నిద్ర పోయిన మళ్లీ పగలు నిద్రవస్తుందా.. కారణం ఏంటో తెలుసుకోండి..!

Sleeping Dsorder: కొంతమందికి రాత్రంతా నిద్రపోయిన తర్వాత కూడా పగటిపూట నిద్రవస్తుంది. దీనికి కొన్నిప్రత్యేక కారణాలు ఉంటాయి. ఆరోగ్యకరమైన నిద్ర శరీరానికి కచ్చితంగా అవసరం.

Update: 2024-01-03 15:00 GMT

Sleeping Disorder: రాత్రంతా నిద్ర పోయిన మళ్లీ పగలు నిద్రవస్తుందా.. కారణం ఏంటో తెలుసుకోండి..!

Sleeping Dsorder: కొంతమందికి రాత్రంతా నిద్రపోయిన తర్వాత కూడా పగటిపూట నిద్రవస్తుంది. దీనికి కొన్నిప్రత్యేక కారణాలు ఉంటాయి. ఆరోగ్యకరమైన నిద్ర శరీరానికి కచ్చితంగా అవసరం. ప్రతిరోజు 7 నుంచి 9 గంటల నిద్ర ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అయితే రాత్రి నిద్రపోయిన తర్వాత కూడా పగటిపూట నిద్రపోతున్నట్లయితే అది ఇడియోపతిక్ హైపర్సోమ్నియా అనే నాడీ సంబంధిత నిద్ర రుగ్మతకు సంకేతం అవుతుంది. దీని గురించి పూర్తిగా తెలుసుకుందాం.

ఈ వ్యాధికి సంబంధించిన పరిశోధనలో ఇది చాల సాధారణమైనదని తేలింది. ఈ పరిశోధనలో 792 మంది స్లీప్ డేటాను పరిశీలించగా ఈ వ్యాధి వ్యాప్తి చాలా ఎక్కువగా ఉన్నట్లు తేలింది. మూర్ఛ, బైపోలార్ డిజార్డర్, స్కిజోఫ్రెనియాతో పోల్చినప్పుడు ఈ వ్యాధి చాలా సాధారణమని తేలింది. ఈ న్యూరోలాజికల్ స్లీప్ డిజార్డర్‌కు చికిత్స చేయడం చాలా ముఖ్యం. తద్వారా ప్రజల జీవన నాణ్యత మెరుగుపడుతుంది. నిద్ర పరీక్షల ద్వారా ఈ వ్యాధిని గుర్తించవచ్చు. నిద్రను మెరుగుపరచడంలో సహాయపడే అనేక మందులు అందుబాటులో ఉన్నాయి.

ఈ వ్యాధికి కారణం ఆరోగ్య సమస్యలు, మానసిక రుగ్మతలు, కుటుంబ చరిత్ర, జన్యువులు వంటి అనేక రకాల కారణాలు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. దీనిని నయం చేయడానికి సరైన చికిత్స అవసరం. రాత్రి మంచి నిద్ర తర్వాత కూడా మీరు పగటిపూట నిద్రపోతున్నట్లు అనిపిస్తే ఇది ఒక రకమైన సమస్య అని గుర్తించండి. ఇది కొన్ని న్యూరోలాజికల్ స్లీప్ డిజార్డర్‌కు సంకేతమవుతుంది. దీని చికిత్సకు సరైన వైద్య సంరక్షణ, మానసిక మద్దతు అవసరం. తద్వారా ప్రజలు ఈ సమస్య నుంచి బయటపడుతారు.

Tags:    

Similar News