Health Tips: అతిగా ఉప్పు తింటే అనర్థాలే.. ఈ సమస్యలు ఎదురవుతాయి..!

Health Tips: ఎక్కువ ఉప్పు తీసుకోవడం వల్ల రక్తపోటు, గుండె జబ్బులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది.

Update: 2023-02-15 06:33 GMT

Health Tips: అతిగా ఉప్పు తింటే అనర్థాలే.. ఈ సమస్యలు ఎదురవుతాయి..!

Health Tips: ఎక్కువ ఉప్పు తీసుకోవడం వల్ల రక్తపోటు, గుండె జబ్బులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. అంతేకాదు అధిక సోడియం వినియోగం రోగనిరోధక వ్యవస్థపై చెడు ప్రభావం చూపుతుంది. రెగ్యులేటరీ T కణాలు అని పిలువబడే కీలక రోగనిరోధక నియంత్రకాల పనితీరును నిరోధిస్తుంది. వీటిని ట్రెగ్స్ అని పిలుస్తారు. ఉప్పు ఎక్కువ తిన్నప్పుడు కణాలకు శక్తి సరఫరా తక్కువగా ఉంటుంది.

ఉప్పు అధికంగా ఉండే ఆహారాన్ని తినడం వల్ల జీవక్రియ, శక్తి సమతుల్యత దెబ్బతింటుంది. ఉప్పు మన కణాల పవర్ ప్లాంట్స్ అయిన మైటోకాండ్రియాని పనిచేయకుండా చేస్తుంది. ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి అనేక విధాలుగా హాని కలుగుతుంది. ఎక్కువ ఉప్పు తినడం వల్ల నీరు నిలుపుదల అవుతుంది. దీని ఫలితంగా ఉబ్బరం, వాపు సమస్యలు ఏర్పడుతాయి.

అధిక ఉప్పు తీసుకోవడం వల్ల అధిక రక్తపోటు, గుండె జబ్బులు, పక్షవాతం వచ్చే ప్రమాదం ఉంది. అధిక ఉప్పు తీసుకోవడం వల్ల టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. అధిక ఉప్పు తీసుకోవడం లైంగిక జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. మితిమీరిన ఉప్పు మూత్రపిండాలకు హాని కలిగిస్తుంది. కాలక్రమేణా కిడ్నీ ఫెయిల్యూర్‌కి దారితీస్తుంది.నిద్రలేమి సమస్యలు ఏర్పడుతాయి.

Tags:    

Similar News