Health Tips: ఎర్రకారం ఎక్కువ తినే అలవాటుందా.. ఈ ఆరోగ్య సమస్యలని గమనించారా..!
Health Tips: ఎర్రకారం ఎక్కువ తినే అలవాటుందా.. ఈ ఆరోగ్య సమస్యలని గమనించారా..!
Health Tips: సుగంధ ద్రవ్యాల కారణంగా భారతదేశం ఇతర దేశాలని ఆకర్షిస్తోంది. అందుకే ఇండియాకి సుగంధ ద్రవ్యాల దేశం అని కూడా పేరు. అయితే ఈ వస్తువులలో కొన్నింటిని అధికంగా తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదు. అటువంటి వాటిలో ఒకటి ఎర్ర మిరపకాయ. దీనిని పొడి రూపంలో విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. అలాగే కొందరికి ఎర్ర కారం ఎక్కువగా తినడం అలవాటు ఉంటుంది. ఈ స్పైసీ ఫుడ్ వల్ల చాలా ఆరోగ్య సమస్యలని ఎదుర్కోవాల్సి ఉంటుంది. వాటి గురించి ఈ రోజు తెలుసుకుందాం.
ఎర్రకారం వల్ల కలిగే నష్టాలు
ఎర్ర మిరపకాయ చాలా ప్రజాదరణ పొందిన మసాలా. ఎందుకంటే ఇది లేనిదే దాదాపు ఏ వంటకం పూర్తికాదు. ముఖ్యంగా కూరలలో దీనిని ఎక్కువగా వాడుతారు. ఈ మసాలాను ఎక్కువగా తీసుకుంటే ఆరోగ్యానికి చాలా నష్టం జరుగుతుంది. ముఖ్యంగా అల్సర్, గుండెల్లో మంట, పేగు సంబంధిత వ్యాధులు సంభవిస్తాయి.
విరేచనాలు
ఎర్ర మిరపకాయలు తినడం వల్ల విరేచనాలు సంభవిస్తాయి. ఇది కడుపుకు అస్సలు మంచిది కాదు. పరిమిత పరిమాణంలో తినాలి. సాధారణంగా మసాలా దినుసులను డీప్ ఫ్రై చేసినప్పుడు లోపలి భాగం పొట్టకు అంటుకుని ఇబ్బంది పెడుతుంది.
ఎసిడిటీ
ఎర్ర మిరపకాయ జీర్ణక్రియ సమస్యలను కలిగిస్తుంది. ఇది కడుపులో ఆమ్లత్వాన్ని కలిగిస్తుంది. కొంతమంది గుండెల్లో మంట సమస్యని ఎదుర్కొంటారు. మీకు అలాంటి సమస్య ఉంటే వెంటనే ఎర్రకారం తినడం మానుకోండి.
కడుపులో పుండ్లు
సాధారణంగా ఎర్రకారం ఎక్కువ తినేవారికి కడుపులో పుండ్లు తయారవుతాయి. కాబట్టి కారం తక్కువ మోతాదులో తినాలని వైద్యులు సూచిస్తారు. ముఖ్యంగా కారం పొడి చాలా ప్రమాదకరం. దీని కణాలు పొట్టకు, పేగులకు అతుక్కుని అల్సర్లకు కారణమవుతాయని గుర్తుంచుకోండి.