Health Tips: రోజూ మార్నింగ్ వీటిని తినండి.. రోజు మొత్తం ఎనర్జిటిక్‌గా ఉండండి..!
Health Tips: ఉదయం నిద్ర లేచిన వెంటనే చాలామంది టీ లేదా కాఫీలు తాగుతారు.
Health Tips: ఉదయం నిద్ర లేచిన వెంటనే చాలామంది టీ లేదా కాఫీలు తాగుతారు. అలాగే బిస్కెట్లు, కుకీలు తింటారు. కానీ ఇది సరైన ఫుడ్ కాదు. మీరు రోజు మొత్తం ఎనర్జిటిక్‌గా ఉండాలంటే కొన్ని రకాల ఆహారాలు తినాల్సి ఉంటుంది. ఇవి శరీరంలోని అంతర్గత అవయవాలకు శక్తిని అందిస్తాయి. జీర్ణక్రియ సరిగ్గా జరిగేలా చూస్తాయి. అయితే ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసుకుందాం.
ఉదయమే ఒక గ్లాసు నీరు తాగడంతో రోజు ప్రారంభించాలి. ఆ తర్వాత నానబెట్టిన గింజలు, విత్తనాలు తీసుకోవాలి. వీటిని తీసుకోవడం వల్ల రోజు మొత్తం ఎనర్జిటిక్‌గా ఉంటారు. అలసట అనేది ఉండదు. ఇందుకోసం రాత్రి నిద్రపోయే ముందు వీటిని నీటిలో నానబెట్టాలి. ఉదయమే కొన్ని నీళ్ళు తాగి వీటిని తినండి. పరగడుపున ఎలాంటి గింజలు తినాలో తెలుసుకుందాం.
బాదం, ఎండుద్రాక్ష, గుమ్మడి గింజలు, పొద్దుతిరుగుడు విత్తనాలు, అవిసె గింజలని రాత్రంతా నానబెట్టి ఉదయం తినాలి. అయితే అవిసె గింజలను ఎల్లప్పుడూ విడిగా నానబెట్టాలని గుర్తుంచుకోండి. వీటికి మరికొన్ని ఆహారాలని కలుపుకోవచ్చు. తేనె, వాల్నట్, మఖానా, జీడిపప్పు, జోడించుకొని తింటే రుచిగా ఉంటాయి. తర్వాత పాలు తాగవచ్చు.