Liver Health: ధూమపానం, మద్యపానం కాదు..ఈ ఫుడ్స్ మీ లివర్‎ను డ్యామేజ్ చేస్తాయని తెలుసా ?

Liver Health: నేటికాలంలో అనేక అనారోగ్య సమస్యలు వేధిస్తున్నాయి. ముఖ్యంగా లివర్, కిడ్నీ సమస్యలతో చాలా మంది బాధపడుతున్నారు. మనం ఆరోగ్యంగా ఉండాలంటే లివర్ హెల్తీగా ఉండాలి. ఆల్కహాల్, స్మోకింగ్ వల్ల లివర్ పాడైతుందని మనకు తెలుసు. కానీ కొన్ని ఆహారాలు తింటే కూడా లివర్ పాడైతుందని మీకు తెలుసా. వాటిని తింటే లివర్ పూర్తిగా డ్యామేజ్ అవుతుందని నిపుణులు చెబుతున్నారు. అవేంటో చూద్దాం.

Update: 2024-08-23 06:44 GMT

 Liver Health: ధూమపానం, మద్యపానం కాదు..ఈ ఫుడ్స్ మీ లివర్‎ను డ్యామేజ్ చేస్తాయని తెలుసా ?

liver damage: మన శరీరంలో అన్ని అవయవాలు ముఖ్యమైనవే. అవయవాలన్నీ బాగుంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాయి. ముఖ్యంగా గుండె, లివర్,కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలి. అయితే లివర్ అనేది శరీరంలో పెద్ద అవయవం. ఇది మూడు వంతుల వరకు పాడైనా..తిరిగి దానంతట అది బాగు చేసుకునే గుణం కలిగి ఉంటుంది. పావు వంతు బాగున్నా సరే...మళ్లీ ఆరోగ్యంగా మారుతుంది. అయితే చాలా మంది స్మోకింగ్, ఆల్కాహాల్ తాగడం వల్ల లివర్ పాడవుతుందని అనుకుంటారు. ఇవి కూడా కారణాలే. అయినప్పటికీ కొన్ని మనం ప్రతిరోజూ తీసుకునే ఆహారాలు కూడా కాలేయాన్ని ప్రభావితం చేస్తాయి. అలాంటి ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. మరి ఎలాంటి పదార్థాలను మనం తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.

చక్కెర, మైదా పదార్థాలు:

చక్కెర ఎక్కువగా తీసుకుంటే ఆరోగ్యానికి హానికరం. ఎందుకంటే ఇందులో కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. బేకరీ ఫుడ్స్, వైట్ బ్రెడ్, వైట్ రైస్, పేస్ట్రీలు, పాస్తా, స్వీట్లు ఇవన్నీ కూడా మైదాతో తయారు చేస్తారు. మైదాలో జీరో కార్బో, ప్రొటీన్స్ ఉంటాయి. కాబట్టి ఇవి మన ఆరోగ్యానికి మంచివి కావు.

పిండిపదార్ధాలు:

కార్బొహైడ్రేట్లు కూడా ఎక్కువ మోతాదులో తీసుకోకూడదు. ఇవి కాలేయాన్ని డ్యామెజ్ చేస్తాయి. దీని వల్ల ఫ్యాటీ లివర్ గా మారుతుందని వైద్యులు చెబుతున్నారు.

రెడ్​ మీట్​, ప్రాసెస్ చేసిన ఫుడ్స్ :

మనలో చాలా మంది జంగ్ ఫుడ్, ప్రాసెస్ చేసిన ఫుడ్స్, రెడ్ మీట్ ఎక్కువగా తినే అలవాటు ఉంటుంది. రసాయనాలతో తయారు చేసిన ప్రాసెస్ ఫుడ్ కాలేయానికి హాని కలిగిస్తుంది.

కూల్​ డ్రింక్స్​:

శీతలపానీయాలు అత్యంత డేంజరస్ అని వైద్యు చెబుతున్నారు. వీటిని తాగితే లివర్ తొందరగా పాడైతుందని అంటున్నారు. చక్కెర, తీపి పదార్ధాలు ఎక్కువగా తినడం వల్ల కాలేయానికి మంచిది కాదని ఇదంతా లివర్ లో పేరుకుపోయి కొవ్వుగా మారుతుందని చెబుతున్నారు. ఫలితంగా కాలేయం పనితీరు దెబ్బతీస్తుంది. ఉప్పు కూడా ఎక్కువగా తీసుకుంటే కాలేయం ప్రమాదంలో పడుతుందని హెచ్చరిస్తున్నారు.

Tags:    

Similar News