Asafoetida Health Benefits: ఇంగువ తినడం వల్ల ఈ ఆరోగ్య సమస్యలకు ఉపశమనం.. అవేంటంటే..?

Asafoetida Health Benefits: ఇంగువ ఒక మసాల పదార్థం. దీనిని వంటలలో ఎక్కువగా ఉపయోగిస్తారు. భారతదేశంలో ప్రాచీనకాలం నుంచి ఇంగువని వాడుతున్నారు.

Update: 2023-11-02 08:00 GMT

Asafoetida Health Benefits: ఇంగువ తినడం వల్ల ఈ ఆరోగ్య సమస్యలకు ఉపశమనం.. అవేంటంటే..?

Asafoetida Health Benefits: ఇంగువ ఒక మసాల పదార్థం. దీనిని వంటలలో ఎక్కువగా ఉపయోగిస్తారు. భారతదేశంలో ప్రాచీనకాలం నుంచి ఇంగువని వాడుతున్నారు. ఇందులో అద్భుత ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. అందుకే దీనిని ఆయుర్వేదంలో కూడా వినియోగిస్తారు. ఇంగువకి చాలా ఆరోగ్య సమస్యలను నయం చేసే గుణం ఉంది. ఇది వంటకాలకు రుచి పెంచడమే కాకుండా ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇంగువ ఉపయోగించి ఎలాంటి సమస్యలు నయం చేసుకోవచ్చో ఈ రోజు తెలుసుకుందాం.

అజీర్ణం

మీరు కడుపు సంబంధిత సమస్యలతో బాధపడుతుంటే ఇంగువ మీకు ఔషధం కంటే తక్కువేమీ కాదు. అజీర్ణం విషయంలో ముందుగా ఒక గ్లాసు గోరువెచ్చని నీటిని తీసుకుని అందులో ఇంగువ కలుపుకుని తాగాలి. ఇది కాకుండా ఇంగువ గ్రైండ్ చేసి పేస్ట్ తయారు చేసి దానిని నాభి చుట్టూ రుద్దాలి. తొందరగా ఉపశమనం ఉంటుంది.

తలనొప్పి

చాలా సార్లు మనం టెన్షన్ కారణంగా తలనొప్పిని ఎదుర్కోవలసి ఉంటుంది. దీని కోసం పెయిన్ కిల్లర్స్ తీసుకుంటాం. కానీ ఇది ప్రమాదకరమైన పద్ధతి అని చాలా సర్వేల్లో తేలింది. తలనొప్పికి సహజసిద్ధమైన నివారణ కావాలంటే ఇంగువను మెత్తగా నూరి పేస్ట్ లా చేసి నుదుటిపై రాస్తే కొంత సమయం తర్వాత ఉపశమనం లభిస్తుంది.

ఉబ్బరం

చాలా మంది ఉబ్బరంతో బాధపడుతారు. ఇది చాలా ఇబ్బందిని కలిగిస్తుంది. ఈ పరిస్థితిలో ఆవనూనెలో ఇంగువ పొడిని కలిపి నాభి చుట్టూ రుద్దాలి. ఇలా చేయడం వల్ల త్వరగా ఉపశమనం లభిస్తుంది.

Tags:    

Similar News