Boiled Egg: చలికాలం ఉడకబెట్టిన గుడ్డు తినండి.. శరీరానికి అద్భుత ప్రయోజనాలు..!
Boiled Egg: చలికాలం చాలామందిలో రోగనిరోధక శక్తి తగ్గుతుంది.
Boiled Egg: చలికాలం చాలామందిలో రోగనిరోధక శక్తి తగ్గుతుంది. అందుకే ప్రతిరోజు ఉడకబెట్టిన గుడ్డు తినాలి. గుడ్డులో అనేక పోషకాలు ఉంటాయి. ఇది మన శరీరాన్ని అలాగే మానసిక ఆరోగ్యాన్ని సరిగ్గా ఉంచుతుంది. అందుకే అల్పాహారంలో గుడ్డు తినేందుకు ఇష్టపడతారు. ఉడకబెట్టిన గుడ్లను తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుందాం.
శరీరం లోపల నుంచి వెచ్చగా
చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచడానికి ప్రోటీన్, కాల్షియం కలిగిన ఆహారం అవసరం. మీరు ప్రతిరోజూ గుడ్లు తీసుకుంటే శరీరం లోపలి నుంచి వెచ్చగా ఉంటుంది. దీని కోసం రోజూ ఒక ఉడికించిన గుడ్డు తినాలి. దీనివల్ల బలంగా తయారవుతారు. అంతే కాదు రోగనిరోధక శక్తి కూడా బలపడుతుంది.
ఐరన్ లోపం
గుడ్లలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. గుడ్లు తీసుకోవడం వల్ల శరీరం అలసట తగ్గుతుంది. శరీరంలో ఐరన్ లోపాన్ని తొలగించడానికి గుడ్లు తినాలి. ముఖ్యంగా మహిళలు, పిల్లలు, వృద్ధులు ప్రతిరోజు గుడ్డు తినాలి. దీనివల్ల వారికి అవసరమైన పోషకాలు అందుతాయి. మహిళలు రక్తహీనత నుంచి బయటపడుతారు.
మెదడుకి మేలు
గుడ్లలో ఉండే ఒమేగా 3, కొవ్వు ఆమ్లాలు మెదడుకు చాలా మేలు చేస్తాయి. గుడ్లలో కోలిన్ ఉంటుంది. దీని వల్ల మెదడు చురుకుగా పనిచేస్తుంది. పిల్లలు తప్పకుండా ప్రతిరోజు ఒక ఉడకబెట్టిన గుడ్డు తినాలి.