Summer Body Detox Drinks: వేసవిలో ఈ పానీయాలు తాగండి.. బాడీలోని వ్యర్థాలు మొత్తం బయటికి వెళ్లిపోతాయి..!
Summer Body Detox Drinks: వేసవిలో సీజనల్ వ్యాధుల ప్రమాదం పొంచి ఉంటుంది. అందుకే ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలి.
Summer Body Detox Drinks: వేసవిలో సీజనల్ వ్యాధుల ప్రమాదం పొంచి ఉంటుంది. అందుకే ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలి. బాడీని హెల్దీగా ఉంచుకోవాలి. మన శరీరం ఒక ఇంజిన్ లాంటిదే. తరచుగా క్లీన్ చేస్తూ ఉండాలి. లేదంటే వివిధ రకాల వ్యాధులకు గురికావాల్సి ఉంటుంది. ఈ కలుషితమైన వాతావరణంలో జీవించడం వల్ల శరీరంలో టాక్సిన్స్ పేరుకుపోతాయి. వీటివల్ల ఇమ్యూనిటీ పవర్ తగ్గుతుంది. అయితే సహజసిద్దంగా కొన్ని పానీయాల ద్వారా బాడీని క్లీన్ చేసుకోవచ్చు. వాటి గురించి ఈ రోజు తెలుసుకుందాం.
కొత్తిమీర నీరు
పరగడుపున కొత్తమీర నీరు తాగితే చాలా మంచిది. శరీరంలో పేరుకుపోయిన చెత్తను మొత్తం మూత్రం ద్వారా బయటికి పంపిస్తుంది. ఇది శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచడంలో సాయపడుతుంది. శరీరంలో జీవక్రియను నియంత్రించే కాలేయం ఆరోగ్యాన్ని కాపాడుతుంది. కొత్తిమీరలో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంలో, క్యాన్సర్‌ను నివారించడంలో సాయపడుతాయి.
దోసకాయ, పుదీనా, అల్లం, నిమ్మకాయ
దోసకాయ, పుదీనా, అల్లం, నిమ్మకాయ ఒక శక్తివంతమైన డిటాక్స్ డ్రింక్. అల్లం జీర్ణక్రియకు సాయపడే ఒక మూలం. కడుపుని శుభ్రపరుస్తుంది. నిమ్మకాయ మీ శరీరాన్ని ఆల్కలైజ్ చేయడంలో సాయపడుతుంది. పుదీనా శరీర వ్యవస్థను శుభ్రపరుస్తుంది.
స్ట్రాబెర్రీ, నిమ్మకాయ
స్ట్రాబెర్రీలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇన్ఫ్లమేషన్‌ను తగ్గిస్తాయి. ఇన్సులిన్ లెవల్స్‌లో సాయపడుతాయి. నీరు, నిమ్మరసంతో మిక్స్ చేయడం వల్ల జీర్ణక్రియకు, pH స్థాయిలను సమతుల్యం చేస్తూ శరీరాన్ని నిర్విషీకరణ, శుభ్రపరచడంలో సాయపడుతుంది.
జీలకర్ర నీరు
జీలకర్ర నీరు శరీరంలోని అన్ని విషాలను బయటికి పంపిస్తుంది. ఆకలి హార్మోన్లను కంట్రోల్ చేస్తుంది. జీవక్రియను వేగవంతం చేయడానికి సాయపడుతుంది.