Allergy Symptoms: అలర్జీకి గురైతే ఆందోళన చెందవద్దు.. ఈ లక్షణాలు కనిపిస్తే ఈ చర్యలు తీసుకోండి..!

Allergy Symptoms: కొంతమందికి ఎలర్జీ సమస్య ఉంటుంది. వీరు తరచుగా ఎలర్జీకి గురవుతూ ఉంటారు.

Update: 2024-04-13 14:00 GMT

Allergy Symptoms: అలర్జీకి గురైతే ఆందోళన చెందవద్దు.. ఈ లక్షణాలు కనిపిస్తే ఈ చర్యలు తీసుకోండి..!

Allergy Symptoms: కొంతమందికి ఎలర్జీ సమస్య ఉంటుంది. వీరు తరచుగా ఎలర్జీకి గురవుతూ ఉంటారు. దీనికి కారణాలు అనేకం ఉన్నాయి. ముఖ్యంగా ఫిబ్రవరి, ఏప్రిల్ మధ్య పుప్పొడి అలెర్జీ ప్రమాదం గణనీయంగా ఉంటుంది. 2021లో సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం భారతదేశంలో 20 నుంచి 30 శాతం మంది ప్రజలు అలెర్జీలతో బాధపడుతున్నారు. 15 శాతం మంది ఆస్తమాతో బాధపడుతున్నారు. పుప్పొడి అనేది మానవులలో అలెర్జీ రినిటిస్, ఆస్తమా, అటోపిక్ డెర్మటైటిస్ వాపునకు కారణమవుతుంది. దీని లక్షణాలు, చికిత్స గురించి తెలుసుకుందాం.

లక్షణాలు

1. ముక్కు కారడం (రినైటిస్)

2. మూసుకుపోయిన ముక్కు (నాసికా రద్దీ)

3. తుమ్ములు

4. ముక్కు, కళ్లు, చెవులు, నోటిలో దురద

5. కళ్లు ఎరుపు

6. కళ్ల చుట్టూ వాపు

ఈ రెమెడీస్ పాటించండి

అలెర్జీ లక్షణాలు కనిపించిన వెంటనే నివారణను తీసుకోవడం అవసరం. ఇది నాసికా సమస్యలకు మాత్రమే పరిమితం అయితే నాసల్ స్ప్రేలు తీసుకొని వాడితే సరిపోతుంది. అదే సమయంలో దగ్గు, శ్లేష్మం, శ్వాస ఆడకపోవడం , గురక, ఆస్తమా వంటి లక్షణాలు ఉంటే ఇన్హేలర్‌ను క్రమం తప్పకుండా ఉపయోగించాలి.

ఇలా రక్షించుకోండి

గాలులు లేదా చలి ఉన్నప్పుడు ఇంట్లోనే ఉండాలి. తోటకి వెళ్లడం మానుకోవాలి. బయటకు వెళ్లేటప్పుడు మాస్క్ ధరించాలి. తలుపులు, కిటికీలు మూసివేయాలి. బయట నుంచి ఇంటికి వచ్చినప్పుడు బట్టలు మార్చుకుని స్నానం చేయాలి. పడుకునే పరుపులను క్లీన్‌ చేయాలి.

ఈ విషయాలపై ప్రత్యేక శ్రద్ధ

ఇంటిని క్రమం తప్పకుండా శుభ్రం చేయాలి. ముఖ్యంగా ఫర్నిచర్, గోడలను శుభ్రం చేయాలి. పెంపుడు జంతువులను శుభ్రంగా ఉంచాలి. ధూమపానం మానుకోవాలి. పుష్కలంగా నీరు తాగాలి. ఒత్తిడిని తగ్గించాలి.

Tags:    

Similar News