Health Tips: ఆహారానికి సంబంధించి ఈ తప్పులు చేయవద్దు.. వెంటనే మార్పులు చేయండి..!

Health Tips: ఆహారానికి సంబంధించి ఈ తప్పులు చేయవద్దు.. వెంటనే మార్పులు చేయండి..!

Update: 2023-01-15 14:30 GMT

Health Tips: ఆహారానికి సంబంధించి ఈ తప్పులు చేయవద్దు.. వెంటనే మార్పులు చేయండి..!

Health Tips: చాలామంది ఆహారాన్ని రుచిగా చేయడానికి ఎటువంటి ప్రయత్నం చేయరు. సాదాసీదాగా వండేస్తారు. దీనివల్ల పోషకాహార లోపం ఏర్పడుతుంది. అలాగే మార్కెట్ నుంచి కూరగాయలు, పండ్ల కొనుగోలు నుంచి వాటిని వండే వరకు అనేక తప్పులు చేస్తారు. దీని కారణంగా వాటిలో లభించే విలువైన పోషకాలని నష్టపోతారు. వాటి గురించి వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

పప్పులకి ప్రాధాన్యత

మీరు పండ్లు, కూరగాయలను కొనుగోలు చేయాలని భావించినప్పుడల్లా పచ్చి పప్పులు, చిక్‌పీస్, బటర్ బీన్స్‌లను కొనడానికి ప్రయత్నించండి. పప్పులలో చాలా ఖనిజాలు, ప్రోటీన్లు, ఫైబర్‌ ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి.

కూరగాయలని కట్‌ చేయడం

మీరు కూరగాయలను కత్తిరించినప్పుడల్లా వాటిని పెద్ద ముక్కలుగా కత్తిరించాలని గుర్తుంచుకోండి. చిన్న ముక్కలుగా కత్తిరించడం వల్ల వండేటప్పుడు వేడికి పోషకాలను వేగంగా కోల్పోయే ప్రమాదం ఉంది.

సరిగ్గా వంట చేయడం

వండిన టొమాటోలో క్యాన్సర్-పోరాట లైకోపీన్ ఉంటుంది. అదే సమయంలో క్యారెట్లు, చిలగడదుంపలను ఉడికించడం వల్ల వాటిలో బీటా-కెరోటిన్ పెరుగుతుంది. ఇది మన రోగనిరోధక పనితీరుకు మద్దతు ఇస్తుంది. అలాగే కొన్ని కూరగాయలని ఎక్కువసేపు ఉడికించడం వల్ల ఆహారంలోని పోషకాలు నశిస్తాయి.

స్టీమింగ్ సహాయం

ఆహారాన్ని ఉడకబెట్టకూడదు. పోషకాలను కాపాడుకోవడానికి ఆవిరి మీద ఉడికించడం చేయాలి. దీనివల్ల వాటిలో ఉండే పోషకాలు యధావిధిగా ఉంటాయి.

Tags:    

Similar News