Hair Fall: చలికాలం ఎఫెక్ట్‌.. జుట్టు విపరీతంగా రాలుతుందా..?

Hair Fall: జీవనశైలి సరిగా లేకపోవడం, చెడు ఆహారపు అలవాట్ల వల్ల చిన్నవయసులోనే జుట్టు రాలడం, నెరిసిపోవడం జరుగుతుంది.

Update: 2022-11-11 10:08 GMT

Hair Fall: చలికాలం ఎఫెక్ట్‌.. జుట్టు విపరీతంగా రాలుతుందా..?

Hair Fall: జీవనశైలి సరిగా లేకపోవడం, చెడు ఆహారపు అలవాట్ల వల్ల చిన్నవయసులోనే జుట్టు రాలడం, నెరిసిపోవడం జరుగుతుంది. చుండ్రు కారణంగా జుట్టు మూలాలు దెబ్బతింటున్నాయి. శీతాకాలంలో జుట్టు రాలే సమస్య మరింత తీవ్రమవుతుంది. దీనిని కొన్ని చిట్కాల ద్వారా నివారించవచ్చు. వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.

1. నెయ్యి తినాలి

భారతదేశంలో ప్రాచీన కాలం నుంచి నెయ్యిని వాడుతున్నారు. దీనిని ఆయుర్వేదంలో కూడా వినియోగిస్తారు. ఇది శరీరంలో ఇంజన్ ఆయిల్ లాగా పనిచేసి రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. చలికాలంలో రోజూ నెయ్యి తినాలి. ఇలా చేయడం వల్ల తల వెంట్రుకలు దృఢంగా మారుతాయి.

2. గోరువెచ్చని నూనెతో మసాజ్

చలికాలంలో ఎండలో కూర్చొని గోరువెచ్చని నూనెతో జుట్టుకు కాసేపు మసాజ్ చేయాలి. దీనికి కొబ్బరి నూనె ఉత్తమమైనదిగా చెబుతారు. మసాజ్ చేయడం వల్ల జుట్టు మూలాలు బలపడతాయి చుండ్రు తగ్గుతుంది. ఈ కారణంగా జుట్టు క్రమంగా మందంగా, నల్లగా మారుతుంది.

3. ఉసిరికాయ తినాలి

ఉసిరికాయ తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి బలపడుతుంది. జుట్టు రాలడాన్ని నివారించడంలో ఇది అద్భుతమైన పాత్ర పోషిస్తుంది. అలాగే మీరు ఒక ఉసిరి పేస్ట్ తయారు చేసి జుట్టు మూలాలపై అప్లై చేయవచ్చు. ఇలా చేయడం వల్ల జుట్టు చిట్లడం తగ్గి ధృడంగా తయారవుతుంది.

4. వేడి నీటి స్నానం మానుకోండి

చలికాలంలో చలికి దూరంగా ఉండాలంటే వేడి నీళ్లతో స్నానం చేయడం సర్వసాధారణం. కానీ మీరు చాలా వేడి నీటితో స్నానం చేస్తే చర్మం పొడిగా మారుతుంది. దీని కారణంగా జుట్టు వేగంగా రాలుతుంది. దీనిని నివారించడానికి గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి. ఎక్కువసేపు వేడి నీటి షవర్ కింద నిలబడకూడదు.

Tags:    

Similar News