Too Much Walking: ఎక్కువగా నడిస్తే కీళ్లు అరుగుతాయా? మార్నింగ్ వాక్ చేసేవాళ్లు ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాలి

Too Much Walking: మనం ఆరోగ్యంగా ఉండాలన్నా..ఎలాంటి వ్యాధులు రాకుండా ఉండాలంటే ప్రతిరోజూ నడవాల్సిందేనని వైద్యులు చెబుతుంటారు. అంతేకాదు మార్నింగ్ వాకింగ్ అనేది ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకే చాలా మంది మార్నింగ్ వాకింగ్ కు వెళ్తుంటారు. కొంతమందిలో మాత్రం ఎక్కువగా నడవడం వల్ల మోకాళ్లు బలహీనంగా మారుతాయనే భావన ఉంటుంది. ఇది ఎంత వరకు నిజమో తెలుసుకుందాం.

Update: 2024-08-17 06:02 GMT

వైద్యులు చెబుతున్న వివరాల ప్రకారం వాకింగ్ చేయడం వల్ల మోకాళ్లకు కీళ్లకు ఎలాంటి నష్టం వాటిల్లదు. ముందు నెమ్మదిగా నడవడం స్టార్ట్ చేయాలి. ఆ తర్వాత వేగాన్ని పెంచాలి. మోకాళ్లను నడకకు రెడీ చేయాలంటే కొన్ని స్ట్రెజింగ్ ఎక్సర్ సైజులు కూడా చేయాలి. ఇది శరీర కదలికలను సర్దుబాటు చేస్తుంది. అలాగే శరీరాన్ని కాళ్లను ఎక్కువ సేపు నడవడానికి రెడీ చేస్తుంది. కాబట్టి మీ శరీరాన్ని వాకింగ్ కు సిద్ధం చేసేముందు స్ట్రెచింగ్ చేయడం మరవకూడదు.

ఎక్కువ సేపు నడవడం వల్ల మీ కాళ్లకు, మోకాళ్లకు, కీళ్లకు పాదాలకు ఎలాంటి ప్రమాదం జరగకుండా ఉండాలంటే సౌకర్యవంతమైన షూస్ ధరించాలి. మంచి క్వాలిటీ ఉన్న షూస్ తీసుకోవాలి. రన్నింగ్ షూస్, మంచి గేర్ ఉన్న బూట్లను వేసుకోవడం వల్ల మోకాళ్లకూ, పాదాలకూ మంచి రక్షణ ఉంటుంది. అసౌకర్యంగా ఉన్న బూట్లతో ఎక్కువ దూరం నడవడం కష్టంగా ఉంటుంది. అలా నడిస్తే కూడా పాదాలకు బొబ్బలెక్కే ఛాన్స్ ఉంటుంది. ఆ ప్రభావం మోకాళ్లపై ఉంటుంది.

గతంలో పాదాలకు, మోళ్లకు గాయాలైన సందర్బాలు ఉన్నట్లయితే మీరు పది కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం మార్నింగ్ వాక్ చేయడం మంచిది కాదు. మోకాళ్ల చుట్టూ ఉన్న కండరాలను బలోపేతం చేసేందుకు మెట్లు ఎక్కడం, దిగడం వంటివి చేస్తుండాలి. అలాగే కీళ్లను బలంగా ఉంచేందుకు అంజీర్, బాదంపప్పులు, చికెన్ బోన్ సూప్, మటన్ బోన్ సూప్ వంటివి తీసుకోవాలి.

మీ శరీర బరువును మోసేది మోకాళ్లే కాబట్టి వ్యాయామంతోపాటు ఆహారంలోనూ కొన్ని మార్పులు చేసుకోవాలి. నెమ్మదిగా వాకింగ్ చేయడం ప్రారంభించిన తర్వాత వేగాన్ని పెంచాలి. ఒకసారి వేగంగా ఒకసారి నెమ్మదిగా ఇలా మార్చుతూ నడవడం కంటే స్థిరంగా నడవడం వల్ల బరువు తగ్గడం మరింత సులువుగా ఉంటుంది. వాకింగ్ చేసేటప్పుడు కాళ్లు, మోకాళ్లు, కీళ్లు నొప్పిగా అనిపిస్తే వెంటనే వైద్యులను కలవాలి. వాకింగ్ అలవాటు చేయడానికి ముందుగా ట్రెడ్ మిల్ పై నడిపిస్తే ఆరోగ్యానికి మంచిది. మీ కాళ్లను, మోకాళ్లను, కీళ్లను వాకింగ్ కు అలవాటు చేస్తుంది. దీని వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండవు.

Tags:    

Similar News