Teeth Pain: పంటినొప్పి వల్ల తలనొప్పి వస్తుందా.. ఈ నివారణలు పాటించండి..!
Teeth Pain: పంటినొప్పి చూడటానికి చిన్నసమస్యే అయినప్పటికీ చాల బాధని కలిగిస్తుంది.
Teeth Pain: పంటినొప్పి చూడటానికి చిన్నసమస్యే అయినప్పటికీ చాల బాధని కలిగిస్తుంది. దీనివల్ల ఏ పనిపై శ్రద్ధ చూపలేకపోతారు. నిలకడగా ఒకచోట ఉండలేరు. రోజువారీ జీవితంలో సాధారణ కార్యకలాపాలు కూడా కష్టమవుతాయి. ఇలాంటి సమయంలో ఇంట్లోనే కొన్ని చిట్కాలు పాటించి నొప్పిని నయం చేసుకోవచ్చు. అలాంటి కొన్ని పద్దతుల గురించి ఈరోజు తెలుసుకుందాం.
1. లవంగం
లవంగం సాధారణంగా వేడి గుణాన్ని కలిగి ఉంటుంది. దీని సహాయంతో పంటి నొప్పిని వదిలించుకోవచ్చు. ఇందుకోసం నొప్పి ఉండే దంతాల మధ్య లవంగం మొగ్గను పెట్టాలి. దీనిని నమలవద్దు. కానీ దాని రసాన్ని పీలుస్తూ ఉండాలి. దీనివల్ల దంతాల నొప్పి, జలదరింపు రెండూ తగ్గుతాయి.
2. జామ ఆకులు
జామపండ్లని చాలా మంది ఎంతో ఇష్టంగా తింటారు. కానీ దాని ఆకులు పోషకాలతో నిండి ఉంటాయని చాలామందికి తెలియదు. పంటి నొప్పి విషయంలో జామ ఆకులను తీసుకొని నీటితో శుభ్రం చేసుకోవాలి. వీటిని ఇప్పుడు నెమ్మదిగా నమలాలి. ఇలా చేయడం వల్ల నొప్పి త్వరగా తగ్గిపోతుంది.
3. హాట్ వాటర్
పంటి నొప్పిని వేడి నీటి ద్వారా కూడా తగ్గించవచ్చు. ఇందుకోసం ఒక గిన్నెలో నీటిని వేడి చేసి అందులో అర టీస్పూన్ ఉప్పు కలపాలి. ఇప్పుడు ఈ రెండింటి మిశ్రమాన్ని చిన్న చిన్న సిప్స్ తీసుకుంటు ఉండాలి. ఈ ప్రక్రియ 10 నుంచి 15 నిమిషాల పాటు చేస్తే సమస్య తొలగిపోతుంది.