Dry Mouth Sleeping: నిద్రలో గొంతు ఎండిపోతుందా.. ఇది ఈ వ్యాధులకు దారి తీస్తుంది జాగ్రత్త..!

Dry Mouth Sleeping: కొన్నిసార్లు మంచి నిద్రలో ఉన్నప్పుడు గొంతు తడి ఆరిపోతుంది. వెంటనే నిద్రలేచి నీరు తాగుతాం. ఇలాగే ప్రతిరోజు జరిగితే ఇది ఒక వ్యాధి అని గుర్తించండి.

Update: 2024-02-03 16:00 GMT

Dry Mouth Sleeping: నిద్రలో గొంతు ఎండిపోతుందా.. ఇది ఈ వ్యాధులకు దారి తీస్తుంది జాగ్రత్త..!

Dry Mouth Sleeping: కొన్నిసార్లు మంచి నిద్రలో ఉన్నప్పుడు గొంతు తడి ఆరిపోతుంది. వెంటనే నిద్రలేచి నీరు తాగుతాం. ఇలాగే ప్రతిరోజు జరిగితే ఇది ఒక వ్యాధి అని గుర్తించండి. ఇంకొన్నిసార్లు ఉదయాన్నే నిద్ర లేవగానే గొంతు ఎండిపోతుంది. నిద్రపోతున్నప్పుడు నోరు లేదా గొంతు పొడిబారడం చాలా సాధారణం. ఎందుకంటే నిద్రలో నోటిలో లాలాజలం ఉత్పత్తి తగ్గుతుంది. కానీ ఇది నిరంతరంగా ప్రతిరోజూ జరిగితే చాలా ప్రమాదం. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

నోరు పొడిబారడానికి కారణాలు

1. నోటి శ్వాస

2. శరీరంలో నీటి కొరత

3. స్లీప్ అప్నియా

4. కొన్ని రకాల మందులు తీసుకోవడం వల్ల

5.వివిధ రకాల ఆహారాలు తిన్నా తర్వాత

6. కొన్ని వైద్య పరిస్థితులు కారణంగా

నిపుణులు ఏం చెబుతున్నారు..

నిపుణుల అభిప్రాయం ప్రకారం నిద్రపోతున్నప్పుడు నోరు పొడిబారడం సాధారణం. కానీ తరచుగా సంభవించడం అనేది ఆటో ఇమ్యూన్ డిజార్డర్‌కు సంకేతం. దీనిలో శరీరం రోగనిరోధక వ్యవస్థ శరీరానికి వ్యతిరేకంగా పనిచేస్తుందని అర్థం. దీనివల్ల కళ్లు, నోరు, ఇతర అవయవాలు పొడిబారతాయి. ఆల్కహాల్, పొగాకు వంటి ఉత్పత్తులను ఉపయోగించడం వల్ల గొంతు, నోరు పొడిబారుతాయి. కొన్నిసార్లు వివిధ రకాల మౌత్ వాష్ లు కూడా ఈ సమస్యను కలిగిస్తాయి.

నోరు పొడిబారడం లక్షణాలు

1. నోటిలో జిగట లేదా పొడిగా అనిపించడం

2. మళ్లీ మళ్లీ దాహం వేయడం

3. నోటి పుండ్లు

4. పగిలిన పెదవులు, పొడి గొంతు

5. చెడు శ్వాస

6. మింగడం కష్టంగా ఉండడం

7. బొంగురుపోవడం లేదా మాట్లాడటం కష్టంగా ఉండడం

8. నోటిలో చేదు రుచి

9. మందపాటి లాలాజలం కలిగి ఉండడం

10. నిద్రించడానికి ఇబ్బంది అనిపించడం

నివారణ పద్ధతులు

1. మిమ్మల్ని మీరు హైడ్రేటెడ్ గా ఉంచుకోవాలి. తరచుగా నీరు తాగుతూ ఉండాలి.

2. శరీరంలో నీటి కొరతను అనుమతించవద్దు

3. మద్యం, పొగాకు తీసుకోవద్దు

4. ఆల్కహాల్ ఆధారిత మౌత్ వాష్‌ను ఉపయోగించవద్దు

Tags:    

Similar News