Diabetes Care Tips: ఉదయం రక్తంలో చక్కెర శాతం పెరుగుతుందా.. ఈ ఆకుపచ్చ పండ్లను తింటే బెస్ట్..!
Diabetes Care Tips: దేశంలో రోజు రోజుకు షుగర్‌పేషెంట్లు పెరిగిపోతున్నారు. డయాబెటీస్ అనేది ఒక దీర్ఘకాలిక వ్యాధి.
Diabetes Care Tips: దేశంలో రోజు రోజుకు షుగర్‌పేషెంట్లు పెరిగిపోతున్నారు. డయాబెటీస్ అనేది ఒక దీర్ఘకాలిక వ్యాధి. దీనికి సరైన మందులు లేవు కానీ జీవనశైలిలో మార్పులు చేసుకొని కంట్రోల్ చేసుకోవచ్చు. ఆరోగ్య నిపుణులు దీనిని సైలెంట్ కిల్లర్ అని పిలుస్తారు. డయాబెటిక్ రోగికి గుండె, కిడ్నీ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. అందుకే కచ్చితంగా మంచి డైట్ మెయింటెన్ చేయాలి. అయినప్పటికీ కొంతమంది షుగర్ పేషెంట్లకు ఉదయం నిద్రలేవగానే రక్తంలో షుగర్ లెవల్స్ విపరీతంగా పెరిగి ఉంటాయి. ఇలాంటి సమయంలో కొన్ని రకాల ఆకుపచ్చ పండ్లను తినడం అలవాటు చేసుకోవాలి. వాటి గురించి ఈ రోజు తెలుసుకుందాం.
జామపండు
జామలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. దీన్ని తినడం వల్ల బ్లడ్ షుగర్ అదుపులో ఉండటమే కాకుండా కొలెస్ట్రాల్ తగ్గుతుంది. జామ ఆకులు రక్తంలో చక్కెరను నియంత్రించగలవు.
పియర్ పండు
డయాబెటిక్ రోగులకు పియర్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. నిజానికి ఇందులో ఆంథోసైనిన్ అనే బలమైన యాంటీఆక్సిడెంట్ ఉంటుంది. దీనితో పాటు ఈ పండు గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది.
ఆకుపచ్చ ఆపిల్
గ్రీన్ యాపిల్స్ వాటి రుచికి ప్రసిద్ధి. పోషకాహారం పరంగా అవి ఎరుపు ఆపిల్లను పోలి ఉంటాయి. కానీ ఈ యాపిల్స్‌లో ప్రత్యేకత ఏంటంటే పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. ఈ కారణంగా, ఇవి మధుమేహ రోగులకు ఉపయోగకరంగా ఉంటాయి.
ఉసిరి
ఉసిరిలో విటమిన్ సి సహా అనేక యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అందుకే ఉసిరికాయను సూపర్ ఫుడ్ అని పిలుస్తారు. వీటిని క్రమం తప్పకుండా తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది.