Hair Fall: జుట్టు వేగంగా రాలుతుందా.. ఈ విటమిన్ల లోపం కావొచ్చు..!
Hair Fall: పొడవైన, మందమైన జుట్టు మహిళల అందాన్ని మరింత పెంచుతుంది.
Hair Fall: పొడవైన, మందమైన జుట్టు మహిళల అందాన్ని మరింత పెంచుతుంది. అయితే ఈ రోజుల్లో పెరుగుతున్న కాలుష్యం, రసాయనాలు అధికంగా ఉండే ఉత్పత్తులు, ఆహారంలో పోషకాహార లోపం కారణంగా జుట్టు రాలే సమస్య ఎక్కువైంది. వర్షంలో జుట్టు రాలడం మరింత ఎక్కువ అవుతోంది. చెమట, జిగట కారణంగా జుట్టు వేగంగా రాలిపోతుంది. ఈ పరిస్థితిలో మీరు పోషకాలు అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి. జుట్టు ఆరోగ్యంగా, స్కాల్ప్ బలంగా ఉండటానికి ఈ విటమిన్లను తీసుకోండి. ఇది మీ జుట్టు పొడవుగా, ఒత్తుగా, నల్లగా పెరగడానికి సహాయపడుతుంది.
1. విటమిన్ సి
విటమిన్ సి జుట్టు పెరుగుదలకు చాలా మంచిది. విటమిన్ సి జుట్టును బలపరుస్తుంది. జుట్టుకు సహజ మెరుపును ఇస్తుంది. విటమిన్ సి కోసం మీరు ఆహారంలో నారింజ, నిమ్మ, జామ, ఉసిరికాయలను చేర్చుకోవాలి.
2. విటమిన్ ఈ
జుట్టు ఆరోగ్యంగా ఉండటానికి విటమిన్ ఈ అవసరం. దీంతో రక్తప్రసరణ బాగా జరుగుతుంది. విటమిన్ ఈ జుట్టు మూలాలను బలపరుస్తుంది. జుట్టు విరిగిపోకుండా చేస్తుంది. విటమిన్ ఈ పుష్కలంగా ఉండే పొద్దుతిరుగుడు గింజలు, బాదం, బచ్చలికూర, అవకాడోలను డైట్‌లో చేర్చుకోవాలి.
3. విటమిన్ డి
విటమిన్ డి జుట్టు పెరుగుదలకు చాలా మంచిది. ఇది మూలాలను బలపరుస్తుంది. బట్టతల సమస్యను తగ్గిస్తుంది. విటమిన్ డి కోసం మీరు పాలు, బలవర్ధకమైన ఆహారాలు, సోయా పాలు, పుట్టగొడుగులు, గుడ్డు పచ్చసొన తీసుకోవాలి.
4. విటమిన్ ఎ
జుట్టు కుదుళ్లకు విటమిన్ ఎ అవసరం. ఇది జుట్టు రాలడాన్ని నివారించడంలో సహాయపడుతుంది. విటమిన్ ఎ కోసం, చిలగడదుంపలు, క్యారెట్లు, అరటిపండ్లు, బచ్చలికూర, ఇతర ఆకుపచ్చ కూరగాయలను తినాలి.