Sleep Late: ఆలస్యంగా నిద్ర పోతున్నారా.. ఈ వ్యాధుల ప్రమాదం ఎక్కువ..!

Sleep Late:నేటి కాలంలో జీవనశైలి మారడం వల్ల చాలామంది అనేక రోగాల బారిన పడుతున్నారు. ముఖ్యంగా లేట్​గా పడుకోవడం లేట్​గా నిద్రలేవడం వల్ల చాలా వ్యాధులకు గురవుతున్నారు.

Update: 2024-02-27 16:00 GMT

Sleep Late: ఆలస్యంగా నిద్ర పోతున్నారా.. ఈ వ్యాధుల ప్రమాదం ఎక్కువ..!

Sleep Late: నేటి కాలంలో జీవనశైలి మారడం వల్ల చాలామంది అనేక రోగాల బారిన పడుతున్నారు. ముఖ్యంగా లేట్​గా పడుకోవడం లేట్​గా నిద్రలేవడం వల్ల చాలా వ్యాధులకు గురవుతున్నారు. నగరాలు, పట్టణాలలో ఈ సంస్కృతి ఎక్కువగా ఉంది. ప్రస్తుత బిజీలైఫ్​లో చాలామంది లేట్​ నైట్​ ఉద్యోగాలు చేస్తున్నారు. దీనివల్ల లేట్​గా పడుకొని ఉదయం లేట్​గా లేస్తున్నారు. దీనికి ఎలక్ట్రానిక్​ గాడ్జెట్ల ప్రభావం కూడా ఎక్కువగా ఉంది. ఒక పరిశోధన ప్రకారం యువత రాత్రి 3 నుంచి 4 గంటలకు పడుకుంటున్నట్లు తేలింది. స్మార్ట్​ఫోన్​, సోషల్​మీడియా ప్రభావం వీరిపై ఎక్కువగా ఉంటుంది. అయితే ఆలస్యంగా నిద్రించేవారు ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటారో ఈ రోజు తెలుసుకుందాం.

జీర్ణక్రియ సమస్యలు

మీరు లేట్​గా పడుకొని ఉదయం లేట్​గా లేవడం వల్ల మీ జీర్ణక్రియ ప్రక్రియ నెమ్మదిగా మారుతుంది. ఇది ఎసిడిటీ, ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలను కలిగిస్తుంది. ఈ సమస్య పెరిగితే పైల్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆలస్యంగా నిద్రలేచేవారు జీర్ణక్రియకి సంబంధించిన సమస్యలతో బాధపడుతూ ఉంటారు.

మధుమేహం

లేట్​గా పడుకొని లేట్​గా లేచేవారికి మధుమేహం సమస్య పొంచి ఉంది. ఇది ఒక దీర్ఘకాలిక వ్యాధి.

లేటుగా లేస్తే లేట్​గానే తింటాం రోజులో జరిగే అన్ని పనులు కూడా లేట్​గానే జరుగుతుంటాయి. జీవనశైలి మారిపోవడంతో శరీరంలో రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుంది. ఆకలికి సంబంధించిన సమస్యలు ఎదురవుతాయి. ఎక్కువగా తినడం వల్ల కొవ్వు పేరుకుపోతుంది. కార్బోహైడ్రేట్స్​ పెరిగి మధుమేహానికి గురవుతారు. అంతేకాకుండా మిగతా వారితో పోల్చితే చాలా లేజీగా కనిపిస్తారు.

గుండె జబ్బులు

ఆలస్యంగా నిద్రలేవడం వల్ల తెల్లవారుజామున సూర్యరశ్మిని పొందలేరు. దీనివల్ల డి విటమిన్​ లభించక ఎముకలు బోలుగా మారుతాయి. అంతేకాదు శరీరంలో హార్మోన్ల స్థాయి దెబ్బతింటుంది. రక్తపోటు, చెడు కొలెస్ట్రాల్ విపరీతంగా పెరుగుతుంది. ఇది గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది.

ఊబకాయం

ఆలస్యంగా నిద్రలేచే అలవాటు ఉన్నవారిలో జీవక్రియలు మందగిస్తాయి. దీని కారణంగా ప్రజలు కేలరీలు బర్న్ చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీని వల్ల శరీరంలో కొవ్వు నిల్వలు పేరుకుపోతాయి. ఊబకాయం పెరిగి మీ శరీర బరువును మీరు మోయలేకపోతారు. అధిక బరువు వల్ల కొత్తగా కీళ్ల నొప్పులు మొదలవుతాయి. మెట్లు ఎక్కలేరు త్వరగా ఆయాసపడుతారు. 

Tags:    

Similar News