Stomach Cancer: పొట్టలో తరచుగా ఇబ్బందిగా ఉంటుందా.. కడుపు క్యాన్సర్ గురించి తెలుసుకోండి..!
Stomach Cancer: కొంతమంది తరచుగా ఉదర సమస్యలతో బాధపడుతుంటారు.
Stomach Cancer: కొంతమంది తరచుగా ఉదర సమస్యలతో బాధపడుతుంటారు. వీటి ఉపశమ నం కోసం తాత్కాలికంగా మెడికల్ షాప్‌లో ట్యాబ్లెట్లు తీసుకొని వేసుకుంటారు. కానీ పొట్ట సమస్య లు ధీర్ఘకాలికంగా వేధిస్తుంటే అది కడుపు క్యాన్సర్‌కు దారితీస్తుంది. నిజానికి క్యాన్సర్ అనేది ఒక డేంజర్ వ్యాధి. వచ్చిందంటే కోలుకోవడం చాలా కష్టం. ఎందుకంటే దీని లక్షణాలు ఆలస్యంగా బయటపడుతాయి. కానీ నేటి రోజుల్లో ఇదొక కామన్ వ్యాధిలా మారిపోయింది. ఈ రోజు కడుపు క్యాన్సర్ లేదా గ్యాస్ట్రిక్ క్యాన్సర్ గురించి తెలుసుకుందాం.
స్టమక్ క్యాన్సర్ వచ్చినప్పుడు మొదట్లో కడుపు చుట్టుపక్కల ప్రాంతాల్లో నొప్పి మొదలవుతుంది. చాలామంది దీనిని గ్యాస్ గా భావిస్తారు. ఇది చాలా కాలం కొనసాగి తర్వాత తీవ్రంగా మారుతుం ది. అందుకే స్టమక్ క్యాన్సర్ లక్షణాలపై అవగాహన ఉండాలి. బరువు తగ్గడం, కడుపు నొప్పి రావడం, ఆకలి కాకపోవడం, ఆహారం మింగడంలో ఇబ్బంది కలగడం, వాంతులు కావడం, అలసట రావడం, గుండెల్లో మంటలు రావడం, తరచూ గ్యాస్ సమస్య ఎదురవడం, కొంచెం తిన్న తర్వాత కడుపు నిండిన అనుభూతి కలగడం కడుపు క్యాన్సర్ లక్షణాలు అని చెప్పవచ్చు.
హెచ్‌పైలోరీ బ్యాక్టీరియా వల్ల కడుపు క్యాన్సర్ వస్తుంది. ఈ బ్యాక్టీరియా కడుపులోని కణాలను దెబ్బతీస్తుంది. ఈ కణాలు నెమ్మదిగా పెరుగుతూ కడుపులో కణితులను ఏర్పరుస్తాయి. ఇవి శరీరంలోని అన్ని ప్రాంతాలకు వ్యాపిస్తాయి. ధూమపానం వల్ల కూడా కడుపు క్యాన్సర్ వస్తుంది. ధూమపానం చేసినప్పుడు దాని రసాయనాలు శరీరంలోకి ప్రవేశిస్తాయి. ఇది కడుపు కణాలను ప్రభావితం చేస్తుంది. దీన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల అల్సర్, క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంటుంది. ఆహారపు అలవాట్లు కడుపు క్యాన్సర్‌కు ప్రధాన కారణమవుతాయి.
ఫాస్ట్ ఫుడ్ ఎక్కువ గా తినే వ్యక్తులకు ఇతరులకన్నా కడుపు క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. మందుల దుష్ప్రభావాల వల్ల కూడా కడుపు క్యాన్సర్ వస్తుంది. ఔషధాలలో అనేక రకాల రసాయనాలు ఉంటాయి. ఇవి కడుపు కణాలను దెబ్బతీస్తాయి. ఎండోస్కోపీ, జీవాణు పరీక్ష, సోనోగ్రఫీ, CT స్కాన్ ద్వారా కడుపు క్యాన్సర్ నిర్ధారణ అవుతుంది.