Fish Curry: చేపల కూర అంటే చాలా ఇష్టమా.. తినేముందు ఈ విషయాలు గమనించండి..!
Fish Curry: పోషకాలు అధికంగా ఉండే ఆహారాలలో చేపలు ఒకటి.
Fish Curry: పోషకాలు అధికంగా ఉండే ఆహారాలలో చేపలు ఒకటి. ఇందులో ప్రోటీన్లు అధికంగా, సంతృప్త కొవ్వులు తక్కువగా ఉంటాయి. అంతేకాకుండా ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ డి, అనేక ఇతర ఖనిజాలు లభిస్తాయి. అయితే ఈ వార్త వింటే చేపలంటే ఇష్టపడేవారు షాక్ అవుతారు. ఎందుకంటే చేపలు విషతుల్యమవుతున్నాయి.
ఎన్విరాన్‌మెంటల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ మరియు ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ అమెరికా సంయుక్తంగా జరిపిన ఒక అధ్యయనంలో ఈ విషయం తేలింది. సరస్సులు, నదుల నీరు అత్యంత కలుషితంగా మారడంతో అందులో నివసించే చేపలు విషపూరితంగా మారుతున్నాయని కనుగొన్నారు. వీటిలో ప్రమాదకరమైన రసాయనాలు గుర్తించారు. ఇవి తీవ్రమైన వ్యాధులకు కారణమవుతున్నాయని పేర్కొన్నారు.
ఫరెవర్ కెమికల్
ఇటువంటి నదులు, సరస్సులలో ఉండే చేపలలో పర్-అండ్-పాలీఫ్లోరోఅల్కైల్ అనే రసాయన పదార్థాన్ని గుర్తించారు. దీనిని గొడుగులు, రెయిన్‌కోట్‌లు, మొబైల్ కవర్లు వంటి నీటి నిరోధక దుస్తుల తయారీలో వాడుతారు. ఈ రసాయనం హార్మోన్లు, పెరుగుదలపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. దీని కారణంగా థైరాయిడ్, చెడు కొలెస్ట్రాల్ వంటి సమస్యలు సంభవిస్తున్నాయి.
ఫరెవర్ కెమికల్ కారణంగా స్త్రీలకు గర్భస్రావం జరుగుతోంది. లేదా అకాల డెలివరీ అవుతోంది. దీని కారణంగా పిల్లల శరీరం, మెదడు సరిగ్గా అభివృద్ధి చెందడం లేదు. 2017లో ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్ PFOAని హ్యూమన్ కార్సినోజెన్ అని పిలుస్తుంది. అంటే క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని అర్థం. అమెరికాలోని నదులు, సరస్సులలో 3 సంవత్సరాల పరిశోధన తర్వాత ఈ రసాయనం జంతువులలో 2,400 రెట్లు ఎక్కువగా ఉందని తెలిసింది. ఉదాహరణకు మీరు నెలకు ఒకసారి చేపలు తింటే ఒక నెల పొడవునా బ్యాక్టీరియా, ఇతర సూక్ష్మక్రిములతో నిండిన నీటిని తాగినట్లు అర్థం. ఈ రసాయనం అమెరికాలోని 48 రాష్ట్రాల్లో కనుగొన్నారు.