పిల్లల పెంపకంలో ఈ తప్పులు అస్సలు చేయవద్దు..!

Parenting Tips: ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలు విద్యావంతులుగా, బాధ్యతాయుతంగా ఉండాలని కోరుకుంటారు.

Update: 2023-01-19 12:30 GMT

పిల్లల పెంపకంలో ఈ తప్పులు అస్సలు చేయవద్దు..!

Parenting Tips: ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలు విద్యావంతులుగా, బాధ్యతాయుతంగా ఉండాలని కోరుకుంటారు. ఇందుకోసం వారిని ఉత్తమ మార్గంలో పెంచడానికి ప్రయత్నిస్తారు.చెడు అలవాట్లకి దూరంగా ఉండేలా చూస్తారు. అయినప్పటికీ చాలా ఇళ్లలో పిల్లలు మొండిగా ఉంటారు. పిల్లల పెంపకానికి సంబంధించి తల్లిదండ్రులు చేసే కొన్ని తప్పుల వల్ల పిల్లలు ఆ విధంగా ప్రవర్తిస్తారు. వాటి గురించి తెలుసుకుందాం.

తల్లిదండ్రుల స్వభావం

ఇంట్లో తల్లిదండ్రులు మొండిగా ప్రవర్తిస్తే పిల్లలు కూడా అలాగే తయారవుతారు. తల్లిదండ్రుల ప్రభావం పిల్లలపై కచ్చితంగా ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రులు పిల్లల ముందర కలిసి ఉండాలి. గొడవలకి దూరంగా ఉండాలి. ఒకరికొకరు మాట్లాడుకుంటూ ఉండాలి. అప్పుడే పిల్లలు కూడా సరైన పద్దతిలో పెరుగుతారు.

ఏవి చేయాలి.. ఏవి చేయకూడదు

చాలా మంది తల్లిదండ్రులు పిల్లల ప్రతి డిమాండ్‌ను నెరవేర్చడానికి సిద్దపడుతారు. దీంతో పిల్లల్లో కోరికలు పెరుగుతూనే ఉంటాయి. వారి కోరికలని నెరవేర్చకుంటే మొండిగా ప్రవర్తిస్తారు. ఈ పరిస్థితి రాకుండా ఉండాలంటే పిల్లలకి ఏవి చేయాలో ఏవి చేయకూడదో చిన్నప్పటి నుంచే చెబుతూ ఉండాలి.

కుటుంబ పరిస్థితులపై అవగాహన

పిల్లలకు వారి ఇంటి పరిస్థితులు, అవసరాలకు సంబంధించి మొదటి నుంచి అవగాహన కల్పించాలి. కానీ చాలామంది తల్లిదండ్రులు వారికి ఏమి చెప్పరు. దీనివల్ల పిల్లలు ఖరీదైన మాల్, షోరూమ్‌లకి వెళ్లినప్పుడు అక్కడ ఖరీదైన వస్తువులు కొనేందుకు ఉత్సాహం చూపుతారు. వారి డిమాండ్ నెరవేర్చకుంటే మొండిగా మారతారు.

పిల్లలకి సమయం కేటాయించడం

పిల్లలు తమకి సంబంధించిన అన్ని విషయాలని, అవసరాలను వారి తల్లిదండ్రులకు వివరించాలని అనుకుంటారు. కానీ తల్లిదండ్రులు అవన్ని పట్టించుకోరు. వారితో ఎక్కువ సమయం గడపడానికి ఇష్టపడరు. పైగా వారిపై చిరాకు, కోపాన్ని ప్రదర్శిస్తారు. దీనివల్ల పిల్లలు మొండిగా మారుతారు. అందుకే పిల్లలతో గడపడానికి సమయం కేటాయించాలి. వారితో ప్రేమగా మెలగాలి.

Tags:    

Similar News