Ears Cleaning: చెవులు శుభ్రం చేసేటప్పుడు ఇలాంటి పొరపాట్లు అస్సలు చేయవద్దు..!
Ears Cleaning: చెవిలో గులిమి పేరుకుపోయినప్పుడు వినికిడి సమస్యలు ఎదురవుతాయి.
Ears Cleaning: చెవిలో గులిమి పేరుకుపోయినప్పుడు వినికిడి సమస్యలు ఎదురవుతాయి. ఈ సమస్య నుంచి బయటపడటానికి చెవిని శుభ్రంచేయాల్సి ఉంటుంది. కానీ కొన్ని విషయాలలో జాగ్రత్త తీసుకోకపోతే శరీరంలోని ఈ ప్రత్యేక భాగం తీవ్రంగా దెబ్బతింటుంది. చెవి వాక్స్ తయారు చేయడం అనేది ఒక సాధారణ ప్రక్రియ. ఇది వాస్తవానికి కర్ణభేరి రక్షణ కోసం చేస్తుంది. కానీ అది ఎక్కువగా పేరుకుపోతే వినికిడి సమస్యలు ఎదురవుతాయి. చెవులు శుభ్రం చేసుకునేటప్పుడు తరచుగా చేసే తప్పుల గురించి ఈ రోజు తెలుసుకుందాం.
1. కాటన్ స్వబ్స్ వాడటం
చాలా మంది విచక్షణా రహితంగా దూదిని వాడతారు. కానీ చెవులను శుభ్రం చేయడానికి ఇది సరైన పద్ధతి కాదు. దీని కారణంగా చెవిలో గులిమి ఇంకా లోపలికి వెళుతుంది. దీని కారణంగా ఇయర్ డ్రమ్ పగిలిపోయే ప్రమాదం కూడా ఉంటుంది.
2. ఈ వస్తువులు చెవిలో పెట్టుకోవద్దు
చాలా మంది చెవులు శుభ్రం చేయడానికి టూత్‌పిక్‌లు, సేఫ్టీ పిన్స్, కీలు, హెయిర్ క్లిప్‌లు వంటి వాటిని ఉపయోగిస్తారు. వీటివల్ల చెవుల్లో గాయం లేదా రక్తస్రావం జరిగే ప్రమాదం ఉంటుంది. అంతేకాదు చెవి దెబ్బతిని చెవుడు కూడా వచ్చే అవకాశం ఉంటుంది.
3. చెవిలో కొవ్వొత్తులు
సోషల్ మీడియా యుగంలో చెవి క్యాండ్లింగ్ బాగా ఫేమస్ అయింది. అయితే చాలా మంది ఓటోలారిన్జాలజిస్టులు దీనిని మంచిదిగా పరిగణించరు. ఈ పద్ధతి ప్రమాదంతో కూడా ఉంటుంది. ఎందుకంటే ఇది ముఖం, జుట్టు, బయటి చెవి, లోపలి చెవిని కాల్చగలదు.
చెవులు శుభ్రం చేయడానికి ఏమి చేయాలి?
చెవిని శుభ్రం చేయడానికి ఓటోలారిన్జాలజిస్టుల సహాయం తీసుకోవాలి. మీరే స్వయంగా శుభ్రం చేసుకోవాలని అనుకుంటే చెవుల్లో కొన్ని చుక్కల గ్లిజరిన్, మినరల్ ఆయిల్ లేదా ఆవాల నూనె వేసి ఇయర్‌వాక్స్‌ను మృదువుగా చేసి శుభ్రం చేయాలి.