ఈ అవయవాలపై మధుమేహం ఎఫెక్ట్‌.. జాగ్రత్తలు తీసుకోపోతే చాలా ప్రమాదం..!

Diabetes Effect: మధుమేహం చాలా సంక్లిష్టమైన వ్యాధి. దీనికి గురైన వ్యక్తి శత్రువులకి కూడా ఇలాంటి సమస్య రావొద్దని ప్రార్థిస్తాడు.

Update: 2023-03-04 14:30 GMT

ఈ అవయవాలపై మధుమేహం ఎఫెక్ట్‌.. జాగ్రత్తలు తీసుకోపోతే చాలా ప్రమాదం..!

Diabetes Effect: మధుమేహం చాలా సంక్లిష్టమైన వ్యాధి. దీనికి గురైన వ్యక్తి శత్రువులకి కూడా ఇలాంటి సమస్య రావొద్దని ప్రార్థిస్తాడు. భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో మధుమేహ బాధితులు ఉన్నారు. ప్రతి సంవత్సరం ఈ రోగుల సంఖ్య పెరుగుతోంది. ఈ వ్యాధి శరీరాన్ని లోపలి నుంచి విచ్ఛిన్నం చేస్తుంది. ఇది చాలా అవయవాలపై చెడు ప్రభావం చూపుతుంది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.

మధుమేహం ఎందుకు వస్తుంది..?

మధుమేహం జన్యుపరమైన కారణాల వల్ల సంభవిస్తుంది. కానీ చాలా సందర్భాలలో గజిబిజి జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల వల్ల ఇది వస్తుంది. మధుమేహం ఉన్నవారు అనేక వ్యాధుల బారినపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీరు ఆహారపు అలవాట్లు, జీవనశైలిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. లేదంటే ఆరోగ్యం ఎప్పుడైనా క్షీణించవచ్చు. రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం. లేదంటే చాలా ప్రమాదం జరుగుతుంది. రోజూ గ్లూకోమీటర్ సహాయంతో గ్లూకోజ్ పరీక్ష చేయించుకోవాలి.

గుండెపోటు

మధుమేహ వ్యాధిగ్రస్తులకు తరచుగా గుండె జబ్బులు వస్తాయి. చాలా మంది మధుమేహ రోగులు గుండెపోటుకు గురవుతారు. దీని కారణంగా ప్రాణం కూడా పోతుంది. అందుకే కొలెస్ట్రాల్ స్థాయిని కచ్చితంగా అదుపులో ఉంచుకోవాలి.

2. కిడ్నీ

రక్తంలో చక్కెర స్థాయి ఎక్కువగా ఉంటే కిడ్నీపై చెడు ప్రభావం పడుతుంది. దీని కారణంగా మూత్రపిండాల చిన్న ధమనులు దెబ్బతింటాయి. ఇది మూత్రపిండాల వైఫల్య ప్రమాదాన్ని పెంచుతుంది.

3. కంటి సమస్యలు

మధుమేహ వ్యాధిగ్రస్తులలో కంటి సమస్యలు ఎక్కువగా కనిపిస్తాయి. ఈ వ్యాధి చాలా కాలంగా ఉన్నవారికి కంటి చూపు బలహీనపడుతుంది. కాబట్టి క్రమం తప్పకుండా కంటి పరీక్షలు చేయించుకోవడం అవసరం.

Tags:    

Similar News