Health Tips: డెస్క్‌ ఉద్యోగులు పనిమధ్యలో ఈ వ్యాయామాలు చేయాలి.. అప్పుడే చురుకుగా ఉంటారు..!

Health Tips: డెస్క్ ఉద్యోగాలలో గంటల తరబడి ఒకే చోట కూర్చోవలసి ఉంటుంది.

Update: 2023-01-21 16:00 GMT

Health Tips: డెస్క్‌ ఉద్యోగులు పనిమధ్యలో ఈ వ్యాయామాలు చేయాలి.. అప్పుడే చురుకుగా ఉంటారు..!

Health Tips: డెస్క్ ఉద్యోగాలలో గంటల తరబడి ఒకే చోట కూర్చోవలసి ఉంటుంది. దీని కారణంగా చాలా వరకు వెన్నునొప్పి ఏర్పడుతుంది. దీంతోపాటు కండరాలు పటుత్వం కోల్పోతాయి. ఆఫీసులో అలసట, నొప్పి కారణంగా పని చేయాలని అనిపించదు. దీంతో పనిభారం మరింత పెరుగుతుంది. ఫిట్‌గా ఉండాలంటే సరైన జీవనశైలి, వ్యాయామం కచ్చితంగా అవసరం. దీని కోసం మీరు మంచి దినచర్యను అనుసరించాలి. ఆఫీసులో ఉంటూ కూడా మీరు చేయగలిగే కొన్ని సులభమైన వ్యాయామాల గురించి తెలుసుకుందాం.

డెస్క్ పుషప్స్

పుష్‌అప్‌లు చేయడం అందరికీ సాధ్యం కాదు. కానీ దాదాపు అందరూ డెస్క్ పుషప్‌లు చేయవచ్చు. దీన్ని చేయడానికి డెస్క్ నుంచి దూరంగా నిలబడి రెండు చేతులని డెస్క్ మూలపై లేదా అంచున ఉంచి ఛాతీని ముందుకు వెనుకకు పుషప్ చేయాలి. దీనివల్ల నీరసం, నిద్ర రెండూ దూరమవుతాయి. అంతేకాదు కండరాలకు బలంతోపాటు అలసట కూడా తొలగిపోతుంది.

స్టెప్ అప్స్

ఈ వ్యాయామం చేయడానికి మెట్లు ఉపయోగించాలి. చాలామంది ఉద్యోగులు పై అంతస్థులలో పనిచేస్తూ ఉంటారు. కింద ఏదైనా పని ఉన్నప్పుడు లిఫ్ట్‌ ఉపయోగిస్తారు. దీనికి బదులు మెట్లు దిగి వెళ్లడం ఉత్తమం. ఎందుకంటే ఒకేచోట గంటల తరబడి కూర్చుంటాం కాబట్టి మెట్లు దిగడం వల్ల శరీరంలోని అవయవాలు కదిలినట్లుగా ఉంటుంది. అన్ని ఫ్రీ అయిపోతాయి. బరువు కూడా తగ్గించుకోవచ్చు.

ధ్యానం

ధ్యానం ఆరోగ్యానికి అనేక విధాలుగా ప్రయోజనాలు అందిస్తుంది. దీన్ని చేయడం చాలా సులభం కూడా. మీరు చేయాల్సిందల్లా డెస్క్ ముందు కుర్చీలో కూర్చుని కొన్ని నిమిషాలు కళ్ళు మూసుకోవాలి. రోజు ఏమి జరుగుతుందో దానిపై మాత్రమే దృష్టి పెట్టాలి. ఇలా చేయడం వల్ల మీ మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది.

Tags:    

Similar News