మెదడు పనితీరుకు ఈ విటమిన్ అత్యవసరం.. అందుకే ఈ ఆహారాలు..!
మెదడు పనితీరుకు ఈ విటమిన్ అత్యవసరం.. అందుకే ఈ ఆహారాలు..!
Vitamin B7 Deficiency: విటమిన్ B7ని బయోటిన్ అని పిలుస్తారు. ఇది ఆహారాన్ని శక్తిగా మార్చడంలో సహాయపడుతుంది. ఇది కంటి, జుట్టు, చర్మం, మెదడు పనితీరుకు ముఖ్యమైనది. కాలేయ పనితీరుకు కూడా తోడ్పడుతుంది. బయోటిన్ అనేది నీటిలో కరిగే విటమిన్. అంటే శరీరం దీనిని నిల్వ చేయలేదు. ఫలితంగా దీన్ని క్రమం తప్పకుండా తీసుకోవాలి. బయోటిన్ లోపం చాలా అరుదుగా వస్తుంది. ఎందుకంటే మనకు రోజుకు 30 గ్రాములు మాత్రమే అవసరం. బయోటిన్‌ని లభించే ఆహారాల గురించి తెలుసుకుందాం.
1. గుడ్లలో విటమిన్లు, ప్రొటీన్లు, ఐరన్, ఫాస్పరస్ పుష్కలంగా ఉంటాయి. గుడ్డు పచ్చసొన ముఖ్యంగా బయోటిన్‌కి గొప్ప మూలం. మొత్తం వండిన గుడ్డు (50 గ్రాములు)లో 10 మైక్రోగ్రాముల బయోటిన్ ఉంటుంది. ఇది రోజువారీ అవసరంలో 33%గా చెప్పవచ్చు.
2. గింజలు, విత్తనాలలో ఫైబర్, ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. ఇవి అధిక మొత్తంలో బయోటిన్ అందిస్తాయి. ఉదాహరణకు 20 గ్రాముల కాల్చిన పొద్దుతిరుగుడు గింజలలో 2.6 మైక్రోగ్రాముల బయోటిన్ ఉంటుంది. 30 గ్రాముల కాల్చిన బాదంలో 1.5 మైక్రోగ్రాముల బయోటిన్ ఉంటుంది. కాబట్టి వీటిని రెగ్యులర్‌గా తీసుకుంటే సరిపోతుంది.
3. కందగడ్డలో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్, కెరోటినాయిడ్ యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. 125 గ్రాముల కందగడ్డలో 2.4 మైక్రోగ్రాముల విటమిన్ B7 ఉంటుంది. ఇది రోజువారీ అవసరంలో 8 శాతం తీరుస్తుంది.
4. పుట్టగొడుగులను పోషకాలు అధికంగా ఉండే శిలీంధ్రాలు అంటారు. వీటిలో విటమిన్ B7 పుష్కలంగా ఉంటుంది. దాదాపు 120 గ్రాముల క్యాన్డ్ మష్రూమ్స్‌లో 2.6 మైక్రోగ్రాముల బయోటిన్ ఉంటుంది. ఇది రోజువారీ అవసరంలో 10 శాతం.
5. అరటిపండు ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన పండ్లలో ఒకటి. ఇవి ఫైబర్, పిండి పదార్థాలు, విటమిన్ బి, కాపర్, పొటాషియంతో నిండి ఉంటాయి. అరటిలో బయోటిన్ కూడా ఉంటుంది.