Omega 3 Deficiency: శరీరంలో ఒమేగా 3 లోపిస్తే చాలా ప్రమాదం.. వీటిని డైట్‌లో చేర్చుకోండి..!
Omega 3 Deficiency: శరీరం సక్రమంగా పనిచేయడానికి వివిధ రకాల పోషకాలు అవసరమవుతాయి.
Omega 3 Deficiency: శరీరం సక్రమంగా పనిచేయడానికి వివిధ రకాల పోషకాలు అవసరమవుతాయి. అందులో ఒమేగా 3 ఫ్యాటి యాసిడ్ ఒకటి. ఇది లోపిస్తే చాలా రకాల సమస్యలు ఎదురవుతాయి. ఒమేగా-3 శరీరంలోని అన్ని కణాలు సక్రమంగా పనిచేయడానికి దోహదం చేస్తుంది. ముఖ్యంగా ఇది కళ్ళు, మెదడు కణాల పనితీరుకు సంబంధించినది.
ఒమేగా-3 లోపం లక్షణాలు
శరీరంలో ఈ ఫ్యాటీ యాసిడ్ లోపించడం వల్ల చర్మం దురద, పొడిబారడం, జుట్టు పొడిబారడం, కీళ్ల నొప్పులు, బలహీనత, నిద్రలేమి, కళ్లు పొడిబారడం, గుండె సంబంధిత సమస్యలు మొదలవుతాయి. చేపలలో ఒమేగా 3 ఎక్కువగా లభిస్తుంది. అయితే వీటితో పాటు మరిన్ని వెజిటేబుల్ ఐటమ్స్‌లలో కూడా లభిస్తుంది. వాటి గురించి ఈ రోజు తెలుసుకుందాం.
అవిసె గింజలు
అవిసె గింజలు ఒమేగా-3 పవర్‌హౌస్ అని చెప్పవచ్చు. శరీరంలో ఓమేగా 3 లోపాన్ని తీర్చడానికి ప్రతిరోజూ ఆహారంలో అవిసె గింజలను చేర్చుకోవడం ఉత్తమం.
చియా విత్తనాలు
చియా విత్తనాలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. వీటిలో ఒమేగా-3 లభిస్తుంది. ఈ చిన్న గింజలను పానీయం, సలాడ్ లేదా నీటిలో వేసుకొని తాగడం వల్ల ఓమేగా 3 లోపాన్ని భర్తీ చేయవచ్చు.
వాల్నట్
ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు సమృద్ధిగా ఉన్న గింజల్లో వాల్‌నట్స్ ఒకటి. అల్పాహారంలో కొన్ని వాల్‌నట్‌లను తీసుకోవాలి. లేదా వాటిని సలాడ్‌లు, తృణధాన్యాలు లేదా కాల్చిన ఆహారాలలో కలుపుకొని తినాలి.
బీన్స్
ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు కిడ్నీ బీన్స్‌లో ఉంటాయి. కానీ చియా గింజలు లేదా అవిసె గింజలు వంటి ఇతర మూలాల కంటే ఎక్కువగా ఉండవు. కానీ ఆహారంలో కిడ్నీ బీన్స్‌ను చేర్చుకోవడం ద్వారా గుండె, మెదడు ఆరోగ్యాన్ని ప్రోత్సహించే ప్రోటీన్, ఫైబర్, విటమిన్ల లోపాన్ని భర్తీ చేయవచ్చు.
ఆకు కూరలు
బచ్చలికూర, తోటకూర, ఇతర ఆకుకూరలు ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలను కలిగి ఉంటాయి. వివిధ రకాల ఆకు కూరలు తీసుకోవడం వల్ల శరీరంలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌ల లోపాన్ని భర్తీచేయవచ్చు. ఇతర ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందవచ్చు.