Curry Leaves: హెయిర్ ఫాల్ కు చెక్ పెట్టే కరివేపాకు

Curry Leaves: కరివేపాకులో ఉండే బి6 విటమిన్ హార్మోన్స్ ను రెగులేట్ చేసి హెయిర్ ఫాల్ ను అరికడుతుంది.

Update: 2021-03-18 11:48 GMT

Curry Leaves (ఫోటో: ఫైల్ ఇమేజ్)

Curry Leaves: కరిపాకు లేనిదే వంటలని ఊహించుకోలేం. కర్రీ లీవ్స్ కేవలం వంటల్లోనే కాదు, ఇటు మెడికల్ గా కూడా ఎంతో హెల్ప్ చేస్తాయి. ఈ అరోమాటిక్ లీవ్స్ లో విటమిన్ ఏ, బి, సి అలాగే బీ2, కేల్షియం, ప్రోటీన్, ఎమినో యాసిడ్స్, ఫాస్ఫరస్, ఫైబర్ తో పాటు ఐరన్ కంటెంట్ సమృద్ధిగా లభిస్తుంది. హెయిర్ రూట్స్ ను బలపరిచే గుణం కరివేపాకులో ఉంది. అంతేకాకుండా, ఇందులో ఉన్న అనేక ప్రాపర్టీస్ డ్యామేజైన వెంట్రుకలను కూడా రిపేర్ చేస్తాయి. ముఖ్యంగా, ఇందులో ఉండే బి6 విటమిన్ హార్మోన్స్ ను రెగులేట్ చేసి హెయిర్ ఫాల్ ను అరికడుతుంది. అది ఎలా మన "లైఫ్ స్టైల్" లో తెలుసుకుందాం.

గుప్పెడు కరివేపాకు పొడిని హెయిర్ ఆయిల్ లో కలిపి ఈ మిక్స్ తో స్కాల్ప్ ను మసాజ్ చేయాలి. రాత్రంతా అలాగే ఉంచేయాలి. ఆ తరువాత మరుసటి ఉదయాన్నే హెయిర్ వాష్ చేయాలి. ఇలా వారానికి రెండు మూడు సార్లు చేస్తే హెయిర్ గ్రోత్ లో మార్పును గమనించవచ్చు.

గుప్పెడు కరివేపాకును తీసుకుని ఒక కప్పుడు పెరుగుతో పాటు కలిపి మెత్తగా రుబ్బుకోవాలి. దీనిని హెయిర్ కు అప్లై చేసి దాదాపు అరగంట తరువాత గోరువెచ్చటి నీటితో వాష్ చేసుకోవాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తూ వుండాలి.

హెయిర్ గ్రే,వైట్ హెయిర్ తో బాధపడుతున్నారా...

గుప్పెడు కర్రీ లీవ్స్ ను ఒక టేబుల్ స్పూన్ కొబ్బరినూనెలో కలిపి వేయించాలి. కరివేపాకు డార్క్ కలర్ లోకి మారిపోయాక ఆయిల్ ను వడగట్టాలి. తరువాత ఆ ఆయిల్ తో హెయిర్ మసాజ్ చేసుకోవాలి. 30 నుంచి 45 నిమిషాలపాటు అలాగే వదిలేసి హెయిర్ వాష్ ఆ తరువాత హెయిర్ వాష్ చేసుకోవాలి. వారానికి ఒకటి లేదా రెండు సార్లు ఇలా చేస్తూ వుండాలి. మీరే ఆశ్చర్యపోతారు.

గుప్పెడు కరివేపాకులను పేస్ట్ చేసి దానిని స్కాల్ప్ పై అప్లై చేయాలి. ముప్పై నిమిషాల తరువాత ప్లెయిన్ వాటర్ తో వాష్ చేసుకోవాలి. ఇలా వారానికి ఒకసారి చేయాలి. ఇలా చేస్తూ వుంటే అందమైన బౌన్సీ హెయిర్ ను మీ సొంత చేసుకోవచ్చు... సో ఇంకెందుకు కరివేపాకుతో మన హెయిర్ ని అందంగా తీర్చిదిద్దుకుందామా మరి...

Tags:    

Similar News