Cockroach Home Remedies: కిచెన్‌లో బొద్దింకల బాధ ఎక్కువైందా.. ఈ చిట్కాలతో తరిమికొట్టండి..!
Cockroach Home Remedies:వేసవిలో కిచెన్‌లో బొద్దింకల బాధ ఎక్కువగా ఉంటుంది.
Cockroach Home Remedies: వేసవిలో కిచెన్‌లో బొద్దింకల బాధ ఎక్కువగా ఉంటుంది. కొద్దిసేపు డోర్ వేసి ఉంచితే చాలు లోపల ఆగమాగం చేస్తాయి. ఎక్కడ చూసినా అవే కనిపిస్తాయి. వీటివల్ల వండిన వంటలు కూడా పాడయ్యే పరిస్థితులు ఎదురవుతాయి. కొన్నిసార్లు ఫుడ్ పాయిజనింగ్ అవకాశాలు కూడా ఉంటాయి. ముఖ్యంగా పిల్లలు ఉన్న ఇంట్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. వీటివ ల్ల అనేక రకాల వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో వీటిని ఇంటి నుంచి ఎలా తరమికొట్టాలో ఈరోజు తెలుసుకుందాం.
బొద్దింకలను ఇంటి నుంచి తరిమికొట్టడానికి బేకింగ్ సోడా, పంచదార కలిపి ఈ పొడిని ఇంటి ప్రతి మూలలో చల్లాలి. దీంతో ఇవి పారిపోతాయి. వేప అనేక కీటకాలను చంపడానికి పనిచేస్తుంది. వేప ఆకులను గ్రైండ్ చేసి ద్రావణాన్ని తయారు చేసి స్ప్రే బాటిల్‌లో నింపి బొద్దింకలు తిరిగే ప్రాంతంలో స్ప్రే చేయాలి.అంతేకాదు బిర్యాయినిలో వాడే బే ఆకులను తీసుకోవాలి. వీటిని బాగా చూర్ణం చేయాలి. ఈ పొడిని ప్రతి మూలలో చల్లాలి. ఇది బొద్దింకలను దాగి ఉన్న ప్రదేశం నుంచి బయటకు రప్పించి పారిపోయేలా చేస్తుంది.
మీరు మీ ఇంటి నుంచి బొద్దింకలను వదిలించుకోవాలంటే ఎండుమిర్చి, ఉల్లిపాయ, వెల్లుల్లిని కలిపి పేస్ట్ మాదిరి చేయాలి. దీనిని మూలల్లో ఉంచితే దీని వాసనకు బొద్దింకలు పారిపోతాయి. మీరు కిరోసిన్ ఆయిల్ సాయంతో బొద్దింకలను తరిమికొట్టవచ్చు. ఇంట్లో బొద్దింకలు ఎక్కడపడితే అక్కడ కనిపిస్తే వాటిపై కిరోసిన్ చల్లాలి. వెంటనే ఇంటి నుంచి పారిపోతాయి.