Health Tips: దగ్గుకి ఈ చిట్కాలతో చెక్ పెట్టండి.. సులువుగా ఉపశమనం..!
Health Tips: శీతాకాలం చాలామంది దగ్గుబారిన పడుతారు.
Health Tips: శీతాకాలం చాలామంది దగ్గుబారిన పడుతారు. ఇది ఛాతిలో గొంతులో నొప్పిని పెంచుతుంది. రాత్రిపూట సరిగ్గా నిద్రపట్టదు. ఇలాంటి సమయంలో వంటిగదిలో ఉండే ఐదు పదార్థాల ద్వారా దగ్గుని తగ్గించవచ్చు. ఇవి తక్షణమే ఉపశమనం కలిగిస్తాయి. వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.
ఉదయం, సాయంత్రం ఆవిరి
గొంతు నొప్పి కారణంగా తరచుగా దగ్గు వస్తుంది. ఇలాంటి సమయంలో ఉదయం, సాయంత్రం ఆవిరి తీసుకోవాలి. ఈ రెమెడీని 2-3 రోజులు చేయడం వల్ల దగ్గు తగ్గుతుంది. ఆవిరి ప్రభావాన్ని పెంచడానికి మీరు Vicksని కూడా జోడించవచ్చు. దీనివల్ల ఎక్కువ ప్రయోజనం ఉంటుంది.
అల్లం ప్రయోజనకరంగాశీతాకాలం చాలామంది దగ్గుబారిన పడుతారు.
అల్లం వ్యాధి నిరోధకంగా చెబుతారు. దీన్ని తీసుకోవడం వల్ల బ్యాక్టీరియా, వైరస్‌లతో పోరాడే శక్తి శరీరానికి అందుతుంది. అల్లం మెత్తగా చేసి నీటిలో కలపాలి. ఆ తర్వాత ఆ నీటిని వేడిచేసి తాగాలి. టీలో అల్లం కలిపి తాగవచ్చు. ఇలా చేయడం వల్ల దగ్గు నుంచి ఉపశమనం లభిస్తుంది
పసుపు త్వరగా ఉపశమనం
పసుపులో అనేక ఆయుర్వేద గుణాలు ఉంటాయి. ఇందులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ వైరల్ గుణాలు ఉంటాయి. ఇవి దగ్గు నుంచి ఉపశమనం కలిగిస్తాయి. దగ్గు విషయంలో ఒక చెంచా పసుపు తీసుకుని, అందులో కొన్ని నల్లమిరియాలు కలపాలి. ఆ తర్వాత ఆరెంజ్ జ్యూస్‌లో రెండింటినీ మిక్స్ చేసి డ్రింక్‌గా తీసుకోవాలి. ఈ ద్రావణాన్ని తాగడం వల్ల దగ్గు నెమ్మదిగా నయమవుతుంది.
వెల్లుల్లి తినడం
వెల్లుల్లి ప్రభావం వేడిగా ఉంటుంది. దగ్గు, జలుబు, జ్వరం లేదా ఏదైనా వైరల్ అటాక్ వచ్చినప్పుడు వెల్లుల్లి రెమెడీని తీసుకోవడం వల్ల ఉపశమనం పొందవచ్చు. కావాలంటే వెల్లుల్లిని పచ్చిగా తినవచ్చు లేదా వేయించిన తర్వాత కూడా తినవచ్చు. వెల్లుల్లిలో ఉండే యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు దగ్గు నుంచి ఉపశమనం కలిగిస్తాయి.