Hyperthyroidism: థైరాయిడ్‌ పెరిగితే ఎముకలకి ఎఫెక్ట్‌.. ఈ లక్షణాలు గమనించండి..!

Hyperthyroidism: ఈరోజుల్లో చాలామంది మహిళలు థైరాయిడ్ వ్యాధిబారిన పడుతున్నారు.

Update: 2023-05-28 02:30 GMT

Hyperthyroidism: థైరాయిడ్‌ పెరిగితే ఎముకలకి ఎఫెక్ట్‌.. ఈ లక్షణాలు గమనించండి..!

Hyperthyroidism: ఈరోజుల్లో చాలామంది మహిళలు థైరాయిడ్ వ్యాధిబారిన పడుతున్నారు. దీనికి కారణం చెడు జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు. థైరాయిడ్ పెరిగినట్లయితే దాన్ని ఓవర్‌యాక్టివ్ థైరాయిడ్ అంటారు. దీనివల్ల ఆరోగ్యం క్షీణిస్తోంది. మానసిక ఆరోగ్యంపై చెడు ప్రభావం పడుతుంది. అయితే థైరాయిడ్ పెరగడం వల్ల ఎముకలకు కూడా హాని జరుగుతుంది. వైద్యుల ప్రకారం థైరాయిడ్ అధికంగా పనిచేయడం వల్ల అలసట, బలహీనత వస్తుంది. మెడలో వాపు ఏర్పడుతుంది విపరీతంగా చెమట పడుతుంది.

ఎముకలకి ఎఫెక్ట్‌

ఎముకలకు థైరాయిడ్ చాలా ముఖ్యమైనది. శరీరంలో ఎముక జీవక్రియకు ఇది అవసరం. కానీ థైరాయిడ్ ఎక్కువగా పనిచేయడం వల్ల ఎముకల నిర్మాణం దెబ్బతింటుంది. ఎముకలు బలహీనపడుతాయి. అయితే దీని లక్షణాలు చాలా ఆలస్యంగా కనిపిస్తాయి. చాలా సందర్భాలలో కీళ్లలో నొప్పి మొదలవుతుంది. కానీ దీనిని ఆర్థరైటిస్ వ్యాధిగా అనుకుంటారు. అయితే ఇది థైరాయిడ్ వల్ల కూడా సంభవిస్తుంది. ఈ పరిస్థితిలో ఎముకలకు సంబంధించిన ఏదైనా వ్యాధి ఉంటే కచ్చితంగా చెక్‌ చేసుకోవడం అవసరం.

బోలు ఎముకల వ్యాధి

థైరాయిడ్‌ నియంత్రణలో లేకుంటే ఆస్టియోపోరోసిస్‌ వచ్చే ప్రమాదం ఉంటుంది. ఈ వ్యాధిలో ఎముకలు పెళుసుగా మారి బలహీనంగా తయారవుతాయి. కొన్ని సందర్భాల్లో రోగి నడవడానికి కూడా ఇబ్బంది పడుతాడు. ఇది ఫ్రాక్చర్ ప్రమాదాన్ని పెంచుతుంది. వృద్ధాప్యంలో ఈ వ్యాధి చాలా ప్రమాదకరమైనది. ఈ పరిస్థితిలో జీవనశైలిని సరిగ్గా ఉంచుకోవడం చాలా ముఖ్యం. థైరాయిడ్ విస్తరణ లక్షణాలను చూసినట్లయితే వెంటనే చికిత్స తీసుకోవడం ఉత్తమం. 

Tags:    

Similar News