Black Chickpeas: ఉడకబెట్టిన నల్లశెనగలలో అద్భుత పోషకాలు.. శరీరానికి ఈ ప్రయోజనాలు..!

Black Chickpeas: నల్ల శెనగలలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి.

Update: 2023-06-07 16:00 GMT

Black Chickpeas: ఉడకబెట్టిన నల్లశెనగలలో అద్భుత పోషకాలు.. శరీరానికి ఈ ప్రయోజనాలు..!

Black Chickpeas: నల్ల శెనగలలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని కొందరు ఉడకబెట్టి తింటే మరికొందరు నానబెట్టి తింటారు. అయితే ఎలా తిన్నప్పటికి శరీరానికి కావాల్సిన అన్ని పోషకాలు ఇందులో ఉంటాయి. కానీ వైద్య నిపుణులు ఉదయం పూట మొలకెత్తిన శెనగలని తినమని సలహా ఇస్తారు. ఎందుకంటే ఇందులో ప్రొటీన్‌, ఫైబర్‌ అధికంగా ఉంటాయి. నల్లశెనగల ప్రయోజనాల గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.

నల్ల శనగలో లభించే పోషకాలు

నల్లశెనగలని పోషకాల పవర్‌హౌస్ అని పిలుస్తారు. ఇందులో ఉండే ప్రొటీన్ పరిమాణం ఎక్కువగా ఉంటుంది. ఇందులో డైటరీ ఫైబర్ అధికంగా ఉంటుంది. ఉడకబెట్టిన నల్లశెనగలు తినడం వల్ల జీర్ణక్రియ సమస్యలు తొలగిపోతాయి. మలబద్ధకం, గ్యాస్‌తో సహా అనేక కడుపు సమస్యలకి ఉపశమనం లభిస్తుంది. నానబెట్టిన శెనగలు తినడం వల్ల రోజు మొత్తానికి సరిపోయే శక్తి అందుతుంది. రోజుకి ఒక్కసారి ఉడకబెట్టిన శెనగలు తినడం వల్ల ఎక్కువ తినాల్సిన అవసరం ఉండదు. దీనివల్ల బరువు తగ్గడం మొదలవుతుంది.

పచ్చి శనగలు మాత్రమే కాకుండా కాల్చిన శనగలు కూడా ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయి. ఇందులో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర నియంత్రణ, మధుమేహాన్ని కంట్రోల్ చేస్తాయి. ఎముకలను బలంగా ఉంచుతుంది. గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అలాగే ఇందులో పీచు పదార్థం ఉండడం వల్ల జీర్ణ వ్యవస్థను బలపరుస్తుంది. గ్యాస్, అజీర్ణం సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ రోగ నిరోధక శక్తిని పెంచడానికి పనిచేస్తాయి.

Tags:    

Similar News