Health Tips: బరువు తగ్గాలంటే భోజన సమయాల్లో తప్పనిసరి మార్పులు..!
Health Tips: బరువు తగ్గాలంటే భోజన సమయాల్లో తప్పనిసరి మార్పులు..!
Health Tips: బరువు పెరగడం అనేది ప్రజలకు ఎప్పుడూ పెద్ద సమస్య. కరోనా తర్వాత లాక్డౌన్, వర్క్ ఫ్రం హోం పెరగడం వల్ల చాలామంది యువకులు, మధ్య వయస్కులు లావుగా మారారు. అయితే పెరిగిన బరువుని తగ్గించుకోవడానికి భారీ వ్యాయామం, జిమ్‌లో వర్కట్లు చేస్తున్నారు. కానీ వైద్యనిపుణులు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను అనుసరించమని సలహా ఇస్తున్నారు. అంతేకాదు సరైన సమయంలో అల్పాహారం, భోజనం, రాత్రి భోజనం చేయకపోతే బరువు పెరుగుతారని చెబుతున్నారు. వాస్తవానికి నిపుణుల సలహా ప్రకారం.. మూడు సార్లు డైట్ టైమింగ్‌ని ఫిక్స్ చేసి రోజూ ఆహారం తీసుకోవాలి. అప్పుడే శరీరం ఆకారంలో తేడా కనిపిస్తుంది.
భోజనం తర్వాత శరీరం ఎంత సేపు యాక్టివ్‌గా ఉంటుందో కేలరీలు అంత ఎక్కువ సమయం కరుగుతాయి. అలా జరగకపోతే మన నడుము, పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోతుంది. అందువల్ల తినడం తర్వాత వెంటనే నిద్రపోవడం మంచిదికాదు. రాత్రి లేదా పగలు నిద్రకు 3 గంటల ముందు ఆహారం తీసుకోవాలి. నిద్రకి దాదాపు 3 గంటల ముందు ఆహారం తినాలని వైద్యులు సూచిస్తున్నారు. ఎందుకంటే నిద్రపోయే ముందు శరీరం మెలటోనిన్ విడుదల చేస్తుంది. అప్పటికి భోజనం ముగించాలి.
నిద్రించే సమయంలో ఆహారం తీసుకుంటే స్థూలకాయం వస్తుంది. ఇది అందరు గుర్తుంచుకోవాల్సిన విషయం. అనేక సర్వేల ప్రకారం.. టిఫిన్, ఉదయం 7:00 గంటలకు, మధ్యాహ్న భోజనం 12:30 గంటలకు, రాత్రి 7:00 గంటలకు రాత్రి భోజనం చేయడానికి ఉత్తమ సమయం. కానీ ఈ ప్రత్యేక సమయాలలో మీ ఆహారాన్ని తినడం సాధ్యం కాదు కాబట్టి సమయాన్ని 15 నుంచి 20 నిమిషాలు మార్చడం వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు.