Health Tips: ఈ మౌత్ ప్రెష్‌నర్‌తో బెల్లీఫ్యాట్‌కి చెక్.. ఖర్చు కూడా తక్కువే..!
Health Tips: ఈ మౌత్ ప్రెష్‌నర్‌తో బెల్లీఫ్యాట్‌కి చెక్.. ఖర్చు కూడా తక్కువే..!
Health Tips: కరోనా వైరస్ వల్ల చాలామంది కొన్నిరోజులుగా వర్క్‌ఫ్రంహోం చేస్తున్నారు. ఇంట్లోనే ఉండటం వల్ల చాలామంది స్థూలకాయులుగా మారారు. పొట్టని తగ్గించడానికి వర్కవుట్లు చేయడానికి వారికి సమయం ఉండదు. ఈ పరిస్థితుల్లో పెరిగిన బరువుని ఎలా తగ్గించుకోవాలనేది పెద్ద సమస్య. అయితే దీనికి ఒక ఉపాయం ఉంది. కిచెన్‌లో ఉండే ఒక సుగంధ ద్రవ్యం సహాయంతో పొట్ట, నడుము చుట్టు ఉండే కొవ్వును సులువుగా తగ్గించుకోవచ్చు. దాని గురించి తెలుసుకుందాం.
యాలకులు
స్థూలకాయం అనేది ఒక వ్యాధి కాదు కానీ దీని కారణంగా అనేక వ్యాధులు సంభవిస్తాయి. బిజీ జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల స్థూలకాయం ఏర్పడుతుంది. ఈ సమస్యను అధిగమించడానికి యాలకులని తినవచ్చు. ఇవి జలుబు, దగ్గు, నోటి దుర్వాసనను తొలగించడంలో సహాయపడుతాయి. అలాగే బరువు తగ్గడానికి కూడా ఉపయోగపడుతాయి. యాలకులలో కొవ్వును కరిగించే గుణాలు ఉంటాయి. రోజువారీ ఆహారంలో వీటిని చేర్చుకుంటే బెల్లీఫ్యాట్‌ని సులభంగా తగ్గించుకోవచ్చు.
యాలకులని సాధారణంగా కూరగాయలు, పరాటాలు, స్వీట్ల తయారీలో ఎక్కువగా ఉపయోగిస్తారు. కొంతమంది యాలకులని పాలు,టీలో వేసుకొని తాగుతారు. యాలకులు తినడం వల్ల జీర్ణశక్తి పెరుగుతుంది. దీని వల్ల కడుపు సమస్యలు దూరమవుతాయి. అసిడిటీ, మలబద్ధకం, కడుపులో మంట, గ్యాస్ వంటివి తగ్గుతాయి. జీర్ణశక్తి పెరగడం వల్ల కొవ్వు కరిగి క్రమంగా బరువు తగ్గడం మొదలవుతుంది. రోజూ ఒకటి లేదా రెండు చిన్న యాలకులని పచ్చిగా నమిలి తింటే అది చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది.