Dandruff: చుండ్రుతో ఇబ్బంది పడుతున్నారా.? బిర్యానీ ఆకులతో ఇలా చెక్‌ పెట్టండి..

Dandruff problem solution: సాధారణంగా బిర్యానీ ఆకులు వంటకానికి రుచిని తీసుకురావడానికి ఉపయోగపడుతుందని తెలిసిందే. అయితే బిర్యానీలోని కొన్ని ఔషధ గుణాలు చుండ్రు సమస్యను దూరం చేస్తాయని మీకు తెలుసా.?

Update: 2024-08-21 06:51 GMT

Dandruff: చుండ్రుతో ఇబ్బంది పడుతున్నారా.? బిర్యానీ ఆకులతో ఇలా చెక్‌ పెట్టండి..

Bay Leaves for Dandruff: ప్రస్తుతం చుండ్రు సర్వసాధారణ సమస్యగా మారిపోయింది. నీటి కాలుష్యం, వాయు కాలుష్యం, కెమికల్స్‌తో కూడిన షాంపూలు వాడడం కారణం ఏదైనా.. చాలా మందిని చుండ్రు వేదిస్తోంది. దీంతో చుండ్రును తగ్గించుకోవడానికి మార్కెట్లో లభించే రకరకాల షాంపూలను, నూనెలను ఉపయోగిస్తుంటారు. అయితే ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా ఉపశమనం లభించకపోతే బిర్యానీ ఆకులతో నేచురల్ చిట్కా పాటిస్తే.. చుండ్రు ఇట్టే పరార్‌ అవుతుంది. ఇంతనీ చుండ్రును, బిర్యానీ ఆకులతో ఎలా తరిమి కొట్టేచ్చనేగా మీ సందేహం. అయితే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే.

సాధారణంగా బిర్యానీ ఆకులు వంటకానికి రుచిని తీసుకురావడానికి ఉపయోగపడుతుందని తెలిసిందే. అయితే బిర్యానీలోని కొన్ని ఔషధ గుణాలు చుండ్రు సమస్యను దూరం చేస్తాయని మీకు తెలుసా.? అవును బిర్యానీ ఆకుల ద్వారా కేవలం చుండ్రు మాత్రమే కాకుండా.. తలపై ఉండే వాపు, దురద, దద్దుర్లు, పొడి బారడం వంటి సమస్యలను దూరం అవుతాయి. ఇంతకీ బిర్యానీ ఆకులతో హెయిర్‌ ప్యాక్‌ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఇందుకోసం ముందుగా.. కొన్ని బిర్యానీ ఆకులను తీసుకొని, కొన్ని నీళ్లు పొసుకొని బాగా మరిగించాలి. ఆకులు పూర్తిగా మరిగిన తర్వాత, చల్లార్చి బిర్యానీ ఆకులను మిక్సీ పట్టుకోవాలి. అలాగే అందులో.. కాస్త వేప ఆయిల్ లేదా అలోవెరా జెల్, ఉసిరి పొడి లాంటివి యాడ్‌ చేసి మిక్స్‌ చేయాలి. అనంతరం ఈ మిశ్రమాన్ని తలకు బాగా పట్టించాలి. ఇలా ఓ ఐదు నిమిషాలు మసాజ్‌ చేసిన తర్వాత పావుగంట పాటు ఆరబెట్టాలి.

ఆ తర్వాత షాంపూతో తలను శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. ఇలా వారంలో రెండు సార్లు చేస్తే మార్పు ఇట్టే కనిపిస్తుంది. ఇక బిర్యానీ ఆకులతో చేసే రసం కూడా చుండ్రు సమస్యను దూరం చేస్తుంది. ఇందుకోసం ముందుగా కొన్ని బిర్యానీ ఆకులను తీసుకొని నీటిలో బాగా మరిగించాలి. అనంతరం మరిగిన నీటిలో కొబ్బరి నూనె కలిపి తలకు బాగా పట్టించాలి. ఇలా చేస్తే ఇన్ఫెక్షన్లతో పాటు చుండ్రు తగ్గి.. జుట్లు మొదల్లు బలంగా మారుతాయి. చుండ్రు మాత్రమే కాకుండా వెంట్రుకలు రాలడం కూడా తగ్గుతుంది. 

గమనిక : ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు hmtvlive.com బాధ్యత వహించదు.

Tags:    

Similar News