Health Tips: హైబీపీ ఉంటే వీటికి దూరంగా ఉండాలి.. లేదంటే మూల్యం చెల్లిస్తారు..!
Health Tips: ఈ రోజుల్లో చాలామంది హై బీపీతో బాధపడుతున్నారు. హై బీపీ అనేది ఒక సైలెంట్ కిల్లర్. దీనివల్ల ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో ఎవ్వరూ ఊహించలేరు.
Health Tips: ఈ రోజుల్లో చాలామంది హై బీపీతో బాధపడుతున్నారు. హై బీపీ అనేది ఒక సైలెంట్ కిల్లర్. దీనివల్ల ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో ఎవ్వరూ ఊహించలేరు. అందుకే హైబీపీ పేషెంట్లు ఎల్లప్పుడు అలర్ట్‌గా ఉండాలి. వీరు ఉప్పు తీసుకోవడం చాలావరకు తగ్గించాలని వైద్యులు సూచిస్తున్నారు. అధిక మొత్తంలో సోడియం ఉన్న కొన్ని ఆహారాలు తీసుకుంటే రక్తపోటు గణనీయంగా పెరుగుతుంది. ఈ పరిస్థితిలో ఇలాంటి ఆహారాలకు దూరంగా ఉండాలి. ఏయే ఆహారంలో సోడియం ఎక్కువగా ఉంటుందో ఈ రోజు తెలుసుకుందాం.
ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం ఉప్పును ఎక్కువగా సూప్‌ల తయారీలో ఉపయోగిస్తారు. సూప్ తాగడం వల్ల శరీరంలో సోడియం పరిమాణం పెరుగుతుంది. దీనివల్ల బీపీ సమస్యలు ఎదురవుతాయి. గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్ ప్రమాదం చాలా రెట్లు పెరుగుతుంది.
WHO ప్రకారం ఒక రోజులో 5 గ్రాముల కంటే ఎక్కువ ఉప్పు తినకూడదు. ఉప్పులో సోడియం ఉంటుంది కాబట్టి ఇది రక్తపోటును పెంచుతుంది. డాక్టర్ ప్రకారం 113 గ్రాముల చీజ్‌లో దాదాపు 350 mg సోడియం ఉంటుంది. పొడి చీజ్ తింటే ప్రమాదం తక్కువగా ఉంటుంది. సగటున, 140 గ్రాముల పిజ్జా ముక్కలో 765 mg సోడియం ఉంటుంది.
ఎండిన మాంసం వద్దు
ఎండిన మాంసంలో ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి కానీ దీనిని చాలా రోజులు నిల్వ ఉంచడానికి, రుచిని మెరుగుపరచడానికి ఉప్పు కలుపుతారు. 28 గ్రాముల బీఫ్‌లో 620 మిల్లీగ్రాముల సోడియం ఉంటుంది. ఎండిన మాంసాన్ని క్రమం తప్పకుండా సుకోవడం వల్ల శరీరంలో సోడియం స్థాయి పెరుగుతుంది. కాబట్టి దీనిని తినకుండా ఉండాలి.
పచ్చళ్లు తినవద్దు
ఉప్పును అనేక రకాల పచ్చళ్లలో ఉపయోగిస్తారు. కేవలం ఒక ఊరగాయ తింటే శరీరంలో 30 నుంచి 40 మిల్లీగ్రాముల సోడియం లభిస్తుంది. దీని వల్ల అధిక రక్తపోటు వచ్చే ప్రమాదం ఉంది. అందువల్ల పచ్చళ్లు తక్కువగా తినాలి లేదా అస్సలు తినకూడదు. హైబీపీ సమస్యతో బాధపడేవారు వీటికి దూరంగా ఉండాలి.